Pawan Kalyan: డబ్బు కోసమే ఆ పని చేసా..! 2024-06-25 15:06:12

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డబ్బు కోసం అలాంటి పని చేశారా.. అంత పెద్ద హీరోకి డబ్బు అవసరమా అని చాలామంది నోరెళ్లబెడతారు.అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ కి కూడా డబ్బు అవసరం పడి ఒక పని చేశారట.ఆ పని ఏంటంటే..ఓ ప్రకటనలో నటించడం. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలో కూడా నటించడానికి ఒప్పుకోరు.ఇక గతంలో ఆయన పెప్సీ అనే కూల్ డ్రింక్ యాడ్ లో నటించారు.అది కూడా ఆయన పొలం కొనడానికి కొన్ని డబ్బులు తక్కువ పడడంతో ఆ డబ్బు కోసం ఈ యాడ్ లో నటించారట.అయితే ఆ తర్వాత ఈ కూల్ డ్రింక్ వల్ల ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ మళ్లీ ఆ యాడ్లో నటించడానికి ఒప్పుకోలేదట. ఇక ఈ యాడ్ లో నటించడానికి బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల కంటే అధిక రెమ్యూనరేషన్ ఇస్తానని చెప్పినా కూడా పవన్ రిజెక్ట్ చేశారట.