అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆదేశించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుతున్నాయని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి లోయర్ మానేరు డ్యాంను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆదేశించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుతున్నాయని అన్నారు.
ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో మొదలైందని ఆయన అన్నారు. LMDలో 24 టీఎంసీలకు ప్రస్తుతం 14 టీఎంసీల నీళ్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. మిడ్ మానేరుకు మోయ తుమ్మెద వాగు, మూల వాగు నుంచి వరద వస్తోందని పొన్నం తెలిపారు. ఎల్లంపల్లి నుంచి రోజువారీగా ఇప్పటికే నీటి విడుదల జరుగుతోందని తెలిపారు.
మిడ్ మానేరు, లోయర్ మానేరు, రంగ నాయక సాగర్,మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు ప్రాజెక్ట్‌లో నింపుకునే విధంగా వర్షాలు పడ్డాయని తెలిపారు. కోదాడ వరకు నీటిని అందించే అవకాశం ఉందని అన్నారు. కరీంనగర్‌తో పాటు ఇతర మున్సిపాలిటీలలో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు.
కాళేశ్వరంలో టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నీటి నిల్వ కొనసాగుతోందని వెల్లడించారు. ఎల్లంపల్లి నుంచి ప్రతి చుక్క ఉపయోగించుకునే విధంగా ప్రాజెక్టులలో నీళ్లు పంపిస్తామని అన్నారు. శ్రీరామ్ సాగర్‌లో ప్రస్తుతం 64 టీఎంసీల నీళ్లు ఉన్నాయని అన్నారు. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పొన్నం వెల్లడించారు.