ప్రభాస్ తో సినిమా ప్రతి ప్రొడ్యూసర్ డ్రీమ్. అయితే అలాంటి ఛాన్స్ హోంబలే ప్రొడక్షన్స్ కొట్టేసింది. లైన్ గా మూడు సినిమాలకు డీల్ డన్ చేసేసుకుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రభాస్ మార్కెట్ రోజు రోజుకు పెరుగుతుంది. హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్ తో మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకుంది. ఈ మూడు సినిమాలకు ప్రభాస్ దాదాపు వెయ్యి కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారని టాక్. ప్రభాస్ తో సినిమా ప్రతి ప్రొడ్యూసర్ డ్రీమ్. అయితే అలాంటి ఛాన్స్ హోంబలే ప్రొడక్షన్స్ కొట్టేసింది. లైన్ గా మూడు సినిమాలకు డీల్ డన్ చేసేసుకుంది.
దాంతో ఇప్పుడు తెలుగు,కన్నడంలో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా హోంబలే అవతరించనుంది. డీల్ సంగతి ఓకే కాని ఏ డైరక్టర్ తో సినిమాలు చేస్తున్నాడు...ఎంత ఎంత రెమ్యూనిరేషన్ డీటైల్స్ చూద్దాం. డిఫరెంట్ స్టోరీస్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో విజయ్ కిరంగదూర్ ‘హోంబలే ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థను స్థాపించారు. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘నిన్నిందలే’తో నిర్మాణ రంగంలో విజయ్ ప్రయాణం మొదలైంది.
* 2018లో విడుదలైన ‘కేజీయఫ్’ ఈ సంస్థకు గుర్తింపు తెచ్చిపెట్టింది.
*‘కాంతార’, ‘సలార్ సీజ్ ఫైర్’ వంటి చిత్రాలు ఈ బ్యానర్ లో వచ్చాయి. సూపర్ డూపర్ హిట్టు.
సలార్ 2 తో ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ‘ది హోంబలే ఈజ్ కాలింగ్ ప్రభాస్’ అని పేర్కొంది. 2026, 2027, 2028ల్లో ఈ చిత్రాలు ఉండనున్నట్లు అనౌన్స్ చేసింది. సలార్ తప్ప మిగిలిన డీటైల్స్ ఏవి ..బయటకు చెప్పలేదు.అయితే మూడు సినిమాలకు ఒకటే రెమ్యునరేషన్ కాదట. మొదట సినిమాకు రెట్టింపుగా రెండో సినిమాకు, రెండో సినిమాకు రెట్టింపుగా మూడో సినిమాకు ఇవ్వబోతున్నారని మొత్తం కలిపితే వెయ్యి కోట్లు అని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ ఫైనల్ అయ్యారట. ఈ సంస్థతో ఓం రావత్ కూడా కలిశారట. అయితే కథ ఓకే అయ్యిందో లేదో తెలీదు. కాని ప్రభాస్ తో ఓం రావత్ సినిమా డౌట్.