YOGI: గర్భిణి మహిళల కోసం యోగి సర్కార్ అధ్భుతమైన నిర్ణయం !

పేద గర్భిణి మహిళలకు యోగి సర్కార్ ఉచిత అల్ట్రా సౌండ్ సౌకర్యం కల్పించింది. ఇప్పటికే 6 లక్షలకు పైగా మహిళలు ఈ పథకం ద్వారి లబ్ధి పొందుతున్నారు


Published Nov 11, 2024 11:24:00 PM
postImages/2024-11-11/1731347909_116264186286f5f9139744211817d651a97b2bc78.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఉత్తరప్రదేశ్ కు చెందిన పేద గర్భిణి మహిళలకు యోగి సర్కార్ ఉచిత అల్ట్రా సౌండ్ సౌకర్యం కల్పించింది. చాలా మంది పేదవారు ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ ఖర్చులు భరించలేనంత దారుణం గా ఉన్నాయి. కాబట్టి  వాటిపై యోగి సర్కార్ దృష్టి సారించింది. పేద గర్భిణి మహిళలకు యోగి సర్కార్ ఉచిత అల్ట్రా సౌండ్ సౌకర్యం కల్పించింది. ఇప్పటికే 6 లక్షలకు పైగా మహిళలు ఈ పథకం ద్వారి లబ్ధి పొందుతున్నారు.1800 పైగా ప్రైవేట్ హాస్పటిల్స్ లో లేదా ...అల్ట్రా సౌండ్ కేంద్రాల్లో స్కానింగ్ ఫ్రీ గా చేస్తున్నారు.


గత ఏడున్నర సంవత్సరాల్లో రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. దీని ఫలితంగా ఒకప్పుడు 'అనారోగ్య రాష్ట్రం' అని పిలవబడిన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు 'ఆరోగ్య ప్రదేశ్'గా నిలిచింది. తన శక్తి కొలది పేదలకు విద్యా , ఆరోగ్యం విషయం మెరుగైన సదుపాయాలు అందించాలని యోగి ఆదిత్యానాధ్ చాలా ప్రయత్నిస్తున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) డైరెక్టర్ డాక్టర్ పింకీ జోవెల్ మాట్లాడుతూ... తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. ఆరోగ్యం , పౌష్టికాహారం గర్భిణిలకు అందేలా చూస్తామని తెలిపారు.75 జిల్లాల్లోని 1,861 ప్రైవేట్ అల్ట్రాసౌండ్ కేంద్రాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఇప్పటివరకు 14,50,238 ఈ-రూపీ వోచర్లు జారీ చేయగా, 6,81,341 వోచర్లను గర్భిణులు వినియోగించుకున్నారు.


అయితే మహిళలు ఎవరికైతే స్కానింగ్ అవసరమో వారికి హాస్పటిల్ వారు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ వాడుకోకపోతే ...మరోసారి టోకెన్ ను రెన్యువల్ చేయించుకోవచ్చు. ఇలా గర్బిణి కి ఏ ఏ నెలల్లో స్కానింగ్ కావాలో ఆయా నెలల్లో ఈ టోకెన్స్ ను హాస్పటిల్ అందిస్తుంది. ఇది చాా మంచి నిర్ణయమంటున్నారు  నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ladies pregnant uttarapradesh

Related Articles