హెజ్బొల్లా గ్రూపుకు సంబంధించిన భారీ టన్నెల్ ను లెబనాన్ లో గుర్తించారు ఇజ్రాయెల్ సైన్యం. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: స్మశాన వాటికలో సమాధుల మధ్య పెద్ద ఎత్తున సొరంగం బయటపడింది. లెబనాన్ లో ఈ టన్నల్ బయటపడింది. అయితే సరిహద్దు నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కిలోమీటరుకు పైగా ఈ సొరంగం వ్యాపించి ఉంది. అంతేకాదు భారీ ఎత్తున తుపాకీలు ..పేలుడు పధార్ధాలు లభించాయి.
హెజ్బొల్లా గ్రూపుకు సంబంధించిన భారీ టన్నెల్ ను లెబనాన్ లో గుర్తించారు ఇజ్రాయెల్ సైన్యం. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది. బోర్డర్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ టన్నల్ ఉంది, ఇందులో నిండా భారీగా తుపాకులు , మందుగుండు సామాగ్రి , గ్రెనేడ్ లాంచర్లు , క్షిపణులు , ఇతర మిలిటరీ గ్రేడ్ పరికరాలతో సహా ఆయుధాల డంప్ ను గుర్తించింది ఇజ్రాయెల్ సైన్యం. ఈ టన్నల్ లో భారీగా తుపాకులు, మందుగుండు సామాగ్రి, గ్రెనేడ్ లాంచర్లు, క్షిపణులు, ఇతర మిలిటరీ -గ్రేడ్ పరికరాలతో సహా ఆయుధాల డంప్‌ను గుర్తించింది ఇజ్రాయెల్ సైన్యం.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకారం, దక్షిణ లెబనాన్‌లోని ఇజ్రాయెల్ సైన్యం స్మశానవాటిక కింద దాగి ఉన్న హిజ్బుల్లా ఏర్పాటు చేసిన టన్నెల్‌ను ధ్వంసం చేసింది. దీనిలో 450 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ తో నింపేసింది. సెప్టెంబర్ నుంచి ఇలాంటి టన్నల్స్ చాలా దొరికాయని అన్నారు.