లైట్ గా పెద్దగా కష్టం లేని ఎక్సర్ సైజులు చూజ్ చేసుకొండి. వీటి వల్ల మీకు పెద్దగా కష్టం లేకుండానే హ్యాపీగా ఫిట్ గా ఉండొచ్చు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చాలామందికి ఆరోగ్యం మీద చాలా శ్రధ్ధ ఉంటుంది. కాని ఫిజికల్ గా కాస్త ఎక్సర సైజు లు చెయ్యాలంటే మాత్రం అస్సలు మనసు రాదు. ఎందుకో ఫోకస్ చెయ్యలేరు. దానికి కారణం అవి కొద్దిగా కష్టంగా ఉండడమే. అలాంటి వారు కొన్ని టిప్స్ ఫాలో అయితే సరి. లైట్ గా పెద్దగా కష్టం లేని ఎక్సర్ సైజులు చూజ్ చేసుకొండి. వీటి వల్ల మీకు పెద్దగా కష్టం లేకుండానే హ్యాపీగా ఫిట్ గా ఉండొచ్చు.
* ఇందులో మొదటిది..స్క్వాట్స్ చేయడం వల్ల మన శరీరంలోని అన్ని కండరాలు ఒకేసారి కదలుతాయని డాక్టర్ విజయ్ చెబుతున్నారు. ఈ భంగిమ వల్ల ముఖ్యంగా నడుము కింది భాగం శరీరం చాలా దృఢంగా మారుతుందని వివరించారు. ఆడవారిలో చాలా మందికి బెల్లీ ఫ్యాట్ ...పిరుదులు ..తొడల దగ్గర కొవ్వు చేరుతుంది. దీని వల్ల అది తగ్గుతుంది.
* పుష్ అప్స్ చేయడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. పై నుంచి కింది వరకు ఛాతీ, తొడలు, కాళ్లు ఇలా ప్రతి భాగానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. రోజుకి 10 పుషప్స్ చేస్తే చాలు ..చేతులు ..భుజాలు కండరాలు చాలా ఫిట్ గా ఉంటాయి.ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల పిరుదులు, వెనుక భాగం కండరాలు శక్తిమంతంగా మారతాయని విజయ్ తెలిపారు.
ఆడవారిలో బొటర్ ఫ్లై ఎక్సర్ సైజ్ చేస్తే యుటర్నస్ చాలా హెల్దీ గా ఉంటుంది. కాబట్టి ఇది కంపల్సరీ.
ఈ మూడు చేస్తే చాలు ...మూడు నెలల్లో మీరు వెయిట్ కంట్రోల్ అవుతారు. దాంతో పాటు చాలా హెల్దీ గా కూడా ఉంటారు.