సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన కొత్త స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఇటీవల ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సిటాడెల్ కోసం ప్రస్తుతం అందరు మాట్లాడుతున్నారు. బాగుందని ..బాలేదని ఇలా చాలా టాక్స్ జరుగుతున్నాయి . కాని దానికి సమంత ఎంత కష్టపడిందో మీకు తెలీదు. సిటాడెల్ షూటింగ్ జరుగుతున్నపుడు సమంత రెండు సార్లు కళ్లు తిరిగిపడపోయిందట. ఈ విషయంలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన కొత్త స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఇటీవల ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.
సమంత కళ్లు తిరిగిపడిపోయినపుడు నేను చాలా కంగారుపడిపోయా. ఒక రోజు షూటింగ్ జరుగుతుండగా..మరో సారి పడిపోయింది . అప్పటికే మేము రెండు గంటలకి పైగా షూట్ చేశాము. సమంత పరిస్థితిని గమనించి డైరెక్టర్స్ షూటింగ్ బ్రేక్ ఇవ్వగా.. కొద్దిసేపటికే ఆక్సిజన్ ట్యాంకు సమంత కోసం షూటింగ్ స్పాట్‌కి వచ్చింది’’ తర్వాత కూల్ అయ్యింది.
ఇక రెండో సారి ‘‘సెర్బియాలోని ఓ రైల్వే స్టేషన్లో షూటింగ్ చేస్తుండగా సమంత నా వెనుక పరుగెత్తాల్సిన సీన్‌ను షూట్ చేస్తున్నాం. సడన్ గా పరిగెడుతూ..కళ్లు తిరిగిపడిపోయింది. నేనే చూసుకొని ప్యాకప్ చెప్పేశా. వాస్తవానికి మయోసైటిస్ కారణంగా ఈ వెబ్ సిరీస్‌లో నటించలేనని తొలుత సమంత చెప్పింది. కాని మేకర్స్ కి సమంతనే ఫస్ట్ ఆప్షన్ . కాబట్టి మేం సమంత కోసం వెయిట్ చేద్దామనుకున్నాం. కాబట్టే తను కూడా వెయిట్ చేయించకుండా షూటింగ్ చేసింది. దానికి మాత్రం సమంత హాట్సాఫ్ చెప్పాల్సిందే అన్నారు వరుణ్ ధావన్.