Prabhas: ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఆ టీచరమ్మనా..?

ప్రభాస్.. ప్రభాస్..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండియా మొత్తం ప్రభాస్ మానియానే నడుస్తోంది.. కల్కి 2898AD సినిమాతో బాహుబలి సమయంలో ఎలా అయితే ప్రభాస్ పేరు మార్మోగిపోయిందో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాగే  ప్రభాస్ మానియా ఇండియామొత్తం వ్యాపించింది.అయితే అలాంటి ప్రభాస్ పెళ్లి విషయం వచ్చేవరకు కాస్త సైలెంట్ అయిపోతారు.అంతేకాదు ఇప్పటివరకు ఏ హీరోయిన్ తో కూడా తన రిలేషన్ నిజమే అని ఎక్కడా కూడా బయట పెట్టలేదు.ప్రభాస్ కి ఫస్ట్ క్రష్ ఉందనే సంగతి చాలామందికి తెలియదు.. అందరూ ప్రభాస్ మొదట ఇష్టపడింది హీరోయినో లేకపోతే టాలీవుడ్ లో ఉండే హీరోయిన్ నో అనుకుంటారు.కానీ  ప్రభాస్ ఫస్ట్ క్రష్ హీరోయిన్స్ కాదు.అలాగే ఆయన క్లాస్మేట్స్ కూడా కాదట.ఎవరంటే ఓ టీచరమ్మ.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-24/1721811415_firstcrash.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రభాస్.. ప్రభాస్..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండియా మొత్తం ప్రభాస్ మానియానే నడుస్తోంది.. కల్కి 2898AD సినిమాతో బాహుబలి సమయంలో ఎలా అయితే ప్రభాస్ పేరు మార్మోగిపోయిందో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాగే  ప్రభాస్ మానియా ఇండియామొత్తం వ్యాపించింది.అయితే అలాంటి ప్రభాస్ పెళ్లి విషయం వచ్చేవరకు కాస్త సైలెంట్ అయిపోతారు.అంతేకాదు ఇప్పటివరకు ఏ హీరోయిన్ తో కూడా తన రిలేషన్ నిజమే అని ఎక్కడా కూడా బయట పెట్టలేదు.

ఇప్పటికే కృతి సనన్,త్రిష,అనుష్క వంటి హీరోయిన్లతో రిలేషన్ వార్తలు వినిపించిన కూడా దానిపై నోరు విప్పలేదు.కానీ ప్రభాస్ మాత్రం త్రిషని గాఢంగా ప్రేమించారట. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇక ప్రస్తుతం అనుష్క ప్రభాస్ డేటింగ్ లో ఉన్నారనే వార్త ఎప్పుడూ ఉండేదే. ఇదంతా పక్కన పెడితే.. ప్రభాస్ కి ఫస్ట్ క్రష్ ఉందనే సంగతి చాలామందికి తెలియదు.. అందరూ ప్రభాస్ మొదట ఇష్టపడింది హీరోయినో లేకపోతే టాలీవుడ్ లో ఉండే హీరోయిన్ నో అనుకుంటారు.కానీ  ప్రభాస్ ఫస్ట్ క్రష్ హీరోయిన్స్ కాదు.అలాగే ఆయన క్లాస్మేట్స్ కూడా కాదట.ఎవరంటే ఓ టీచరమ్మ.అవును మీరు వినేది నిజమే.

ప్రభాస్ ఓ టీచర్ ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డారట. అయితే ఈ విషయాన్ని ఓ కోలీవుడ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.అందులో యాంకర్ మీ ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పగలరా అని అడిగితే  ఇక్కడే చెన్నైలో అని చెప్పాడు. దానికి ఆ యాంకర్ అమ్మాయి పేరు చెప్పండి అని అడగగా నేను ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను అని చెప్పారు. కనీసం ఏ క్లాసులో ఏ స్కూల్లో ఆమెను చూసారో చెప్పగలరా అని అడిగితే నేను క్లాస్లో కాదు టీచర్ ని చూసి అట్రాక్ట్ అయ్యా.నా ఫస్ట్ క్రష్ టీచర్..

కానీ ఆమె పేరు నాకు గుర్తులేదు.. అంటూ ప్రభాస్ నవ్వుకుంటూ చెప్పారు. ఇక ప్రభాస్ ఈ విషయం చెప్పేటప్పుడు ఆయన మొహంలో వెలుగు చూస్తే ఆయన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా అంత ఆనందపడరు కావచ్చు  అంతలా ఆయన మొహం ఆయన ఫస్ట్ క్రష్ గురించి చెప్పేటప్పుడు వెలిగిపోతుంది.ప్రస్తుతం ఒకప్పటి ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

newsline-whatsapp-channel
Tags : prabhas kalki-2898-ad newslinetelugu anushka-setty prabhas-first-crash

Related Articles