Prabhas : లీక్ అయిన ప్రభాస్ కొత్త సినిమా స్టోరీలైన్.. కథ అదేనా?

హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ భారీ పీరియాడిక్ సినిమా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే హను దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా స్టోరీ ఇదే నంటూ ఓ టాక్ బయటకు వచ్చింది.


Published Jul 28, 2024 05:59:26 AM
postImages/2024-07-28/1722164347_prabhasfouzimovie.jpg

న్యూస్ లైన్ డెస్క్ : బాహుబలి, సలార్ సినిమాలతో పాన్ వరల్డ్ హీరోగా ఎదిగిన ప్రభాస్.. తాజాగా కల్కి సినిమాతో ఎవరూ టచ్ చేయలేని ఎత్తుకు ఎదిగారు. కల్కి తర్వాత వరుసగా పలు సినిమాలకు ప్రభాస్ సైన్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈరోజు రాజాసాబ్ అప్డేట్ కూడా వచ్చింది. అయితే.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ భారీ పీరియాడిక్ సినిమా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే హను దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా స్టోరీ ఇదే నంటూ ఓ టాక్ బయటకు వచ్చింది.

హను రాఘవపూడి సినిమాలంటేనే ఓ రేంజ్ లో ఆసక్తి క్రియేట్ చేస్తాడు. అయితే.. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రభాస్, హనుల కాంబోలో వస్తున్న కథ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. లీక్ అయిన స్టోరీ లైన్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అంటున్నారు డార్లింగ్ అభిమానులు.

స్వాతంత్యానికి ముందు బ్రిటిష్ పరిపాలన సమయంలో జరిగిన కథా నేపథ్యంలో ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా రాబోతోందట. ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా, సైనికుడిగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడట. అంతేకాదు.. యాక్షన్ స్వీకెన్స్ భారీగా ప్లాన్ చేశారట. థియేటర్లో యాక్షన్ సీన్లలో ప్రభాస్ కనిపించేటప్పుడు సీట్లు చిరగడం, విరగడం, ఫ్యాన్స్ విజిల్స్ , అరుపులతో థియేటర్ టాప్ లేచిపోవడం ఖాయం అంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సుభాష్ చంద్రబోస్ నిర్మించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తాడట. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ ని ప్రభాస్ కలిసే సీన్ కథలో హైలెట్ గా నిలవనుందట. ఇప్పటికే ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఇదే నిజమైతే.. ప్రభాస్ ఖాతాలో మరో భారీ హిట్ ఖాయం అంటున్నారు సినీ ప్రేమికులు.

 

newsline-whatsapp-channel
Tags : telangana prabhas kalki-movie movies movie-news new-movie super-movie latest-news telugu-news

Related Articles