PRABHAS: అప్పుడే ప్రభాస్ నెక్స్ట్ సినిమా అప్ డేట్ ...ప్రభాస్ లుక్ అద్దిరిపోయింది

ప్రభాస్( PRABHAS  నెక్స్ట్ మూవీ డీటైల్స్ రిలీజ్ చేస్తున్నారు సందీప్( SANDEEP)  . ఎన్నో క్యారక్టర్లు చేసిన ప్రభాస్ ...పోలీస్ గా మాత్రం ఎక్కడా ఎప్పుడు కనిపించలేదు.


Published Jun 29, 2024 01:15:00 PM
postImages/2024-06-29/1719647171_sddefault1.jpg

 న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  కల్కి( KALKI)  ఫీవర్ ఇంకా తగ్గనేలేదు. అప్పుడే ప్రభాస్ మరో సినిమా అప్ డేట్ వచ్చేసింది. పాన్ వరల్డ్ సినిమా కల్కి కలక్షన్లు డీటైల్స్ రాకముందే ...ప్రభాస్( PRABHAS  నెక్స్ట్ మూవీ డీటైల్స్ రిలీజ్ చేస్తున్నారు సందీప్( SANDEEP)  . ఎన్నో క్యారక్టర్లు చేసిన ప్రభాస్ ...పోలీస్ గా మాత్రం ఎక్కడా ఎప్పుడు కనిపించలేదు. కల్కీ ఊపులోనే సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్న స్పిరిట్ చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని డార్లింగ్ అనుకుంటున్నారట. ఈ స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.


నార్త్‌లో( NORTH)  కూడా కల్కి హవా మాములుగా లేదు. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇక ఇదే ఊపులో ప్రభాస్ తాను తర్వాత చేయబోయే చిత్రం 'స్పిరిట్( SPIRIT) ' పనులు కూడా మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం కాస్త లీన్ లుక్( LEAN LOOK)  మెయింటెయిన్ చేయాలని ప్రభాస్‌కి సందీప్ చెప్పారట. ఈ చిత్రంలో ప్రభాస్ 30 ఏళ్ల వయసులో ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని టాక్. అందుకే ఇప్పుడున్న దాని కంటే కాస్త ఫిట్‌గా ఉండాలని సందీప్ కోరారట. దీన్ని బట్టి ప్రభాస్ 'రెబల్', ( REBAL) 'మిర్చి' ( MIRCHI) టైమ్‌లో కనిపించిన లుక్‌లో మళ్లీ మారే అవకాశం ఉంది. వెయిట్ తగ్గితే ప్రభాస్ చాలా స్మార్ట్ గా కూడా ఉంటారు.


అయితే ఈ సినిమా రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోతుంది. సినిమా రిలీజ్ అయిన తొలిరోజే ఈ బడ్జెట్‌లో సగం రికవరీ చేస్తామని డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలా ధీమాగా చెప్పారు. . శాటిలైట్, డిజిటల్ రైట్స్ నుంచే ఆ బడ్జెట్‌ను రికవరీ చేసేస్తాం. అంతే కాకుండా ఫస్ట్ రోజే...రూ. 150 కోట్ల వసూళ్లు సాధిస్తుంది." అంటూ సందీప్ చెప్పారు. అలానే సినిమా స్క్రిప్ట్ వర్క్ 60 శాతం పూర్తయిందని.. ఈ ఏడాది డిసెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని సందీప్ అన్నారు. మరో నాలుగు ఐదు వారాల తర్వాత షూటింగ్ అప్ డేట్ చేస్తామని తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu spirit sandeep-reddy-vanga

Related Articles