Prabhas: 'రాజా సాబ్' వచ్చేశాడు..! గ్లింప్స్ కూడా..

టాలివుడ్ ద్వారా సినిమాల్లోకి వచ్చిన ఈ హీరో పాన్ ఇండియా సినిమాలతో భారీ విజయాలను అందుకొని దేశవ్యాప్తంగా అభిమానులను పెంచుకున్నాడు. 
 


Published Jul 28, 2024 12:30:48 PM
postImages/2024-07-28//1722150048_modi20240728T123033.921.jpg

న్యూస్ లైన్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఖాతాలో ఉన్న తాజా చిత్రం 'రాజా సాబ్'. ఇటీవల ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా కల్కిAD2898 భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం ఇప్పటికీ పలు థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. టాలివుడ్ ద్వారా సినిమాల్లోకి వచ్చిన ఈ హీరో పాన్ ఇండియా సినిమాలతో భారీ విజయాలను అందుకొని దేశవ్యాప్తంగా అభిమానులను పెంచుకున్నాడు. 

అయితే, ఓవైపు కల్కి విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే ప్రభాస్.. తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. తన కొత్త సినిమా పోస్టర్‌తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ప్రభాస్ నటిస్తున్న 'రాజా సాబ్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, తాజగా  ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని, వెనుకవైపు తిరిగి నవ్వుతున్న ప్రభాస్ ఫోటో కనిపిస్తోంది. అంతేకాకుండా రాజా సాబ్ సినిమా పాన్ ఇండియా గ్లింప్స్ రేపు సాయంత్రం రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ప్రభాస్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

newsline-whatsapp-channel
Tags : ts-news prabhas news-line kalki-2898-ad newslinetelugu maruthi cinema-news rajasab -glimpse peoplemediafactory

Related Articles