ఆన్ లైన్ లో పేమెంట్ చెయ్యని వాళ్లు ఈ రోజుల్లో దాదాపు లేరు. ఉన్నా వాళ్లకి ఆన్ లైన్ పేమెంట్ తెలీక ..చెయ్యరు. అయితే ఈ ఆన్ లైన్ పేమెంట్స్ ఏంటంటే ..దాదాపు QR కోడ్స్ స్కాన్ చేసేయడమే. కాని ఆ క్యూఆర్ కోడ్ స్కానింగ్ వల్ల చిరు వ్యాపారులు నష్టపోతున్నారని తెలుసా ..అలా ఎలా అంటారా .
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆన్ లైన్ లో పేమెంట్ చెయ్యని వాళ్లు ఈ రోజుల్లో దాదాపు లేరు. ఉన్నా వాళ్లకి ఆన్ లైన్ పేమెంట్ తెలీక ..చెయ్యరు. అయితే ఈ ఆన్ లైన్ పేమెంట్స్ ఏంటంటే ..దాదాపు QR కోడ్స్ స్కాన్ చేసేయడమే. కాని ఆ క్యూఆర్ కోడ్ స్కానింగ్ వల్ల చిరు వ్యాపారులు నష్టపోతున్నారని తెలుసా ..అలా ఎలా అంటారా .
మనం షాపు కి వెళ్లి మన పని అయిపోగానే .. డైరక్ట్ గా షాపు గోడకి ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తాం..వాళ్లని ఇంకేం అడగం ...ఈ క్యూర్ ఆర్ కోడ్ కి ఈ పేరు వచ్చిందా ..ఈ పేరు మీదేనా ..అనే క్వశ్చన్ అడగరు. ఇదే పెద్ద ప్రాబ్లమ్. రాత్రి పూట ఆన్ లైన్ స్కామ్స్ చేసే బ్యాచ్ ..ఆ క్యూ ఆఱ్ కోడ్స్ ను మార్చేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
అసలు షాపు ఓనర్ పెట్టిన క్యూ ఆర్ కోడ్ మీద మరో కోడ్ అంటిస్తున్నారు. ఈ విషయాన్ని చిరు వ్యాపారులు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు. దీని వల్ల మనం చేసే డబ్బులు వారి అకౌంట్ లో పడవు. దీన్ని తెలుసుకునే లోపే చాలా డబ్బులు నొల్లేస్తారు. ఒక్కసారి క్యూఆర్ స్కాన్ చేస్తే కస్టమర్ల డబ్బులు కూడా స్వాహా..ఈ సారి క్యూ ఆర్ స్కాన్ చేసినపుడు కాస్త చెక్ చేసుకొని నంబర్ తీసుకొని పేమెంట్స్ చేస్తే స్కామ్ లు జరగకుండా ఉంటాయి చూసుకొండి మరి.
Beware!
Rise of the growing threats of Cyber frauds due to "Digital Payments"
Your digital payment amount through the QR Code scanner, going to some other's account, small businessmen targates, check properly. Better use the speaker.#DigitalPayments #QRCodeFraud #CyberFrauds… pic.twitter.com/5bdelPPFr5 — Surya Reddy (@jsuryareddy) July 26, 2024