Raa Macha Macha: ‘గేమ్ చేంజర్’ నుంచి ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమో రిలీజ్ !

రా మచ్చా మచ్చా..’ అంటూ సాగే ఈ పాట హిందీలో ‘ ధమ్ తు  దికాజా...’ అంటూ అలరించనుంది. అయితే ఈ పాట సెప్టెంబర్ 30 న రిలీజ్ కాబోతున్నట్లు తెలిపారు మూవీ టీం.


Published Sep 28, 2024 11:36:51 AM
postImages/2024-09-28/1727541364_gamechanger.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , డైరక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్  నుంచి క్రేజీ సాంగ్ ప్రొమో రిలీజ్ అయ్యింది.ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ లో ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళంలో పాటు ‘ రా మచ్చా మచ్చా..’ అంటూ సాగే ఈ పాట హిందీలో ‘ ధమ్ తు  దికాజా...’ అంటూ అలరించనుంది. అయితే ఈ పాట సెప్టెంబర్ 30 న రిలీజ్ కాబోతున్నట్లు తెలిపారు మూవీ టీం.


తమన్ మ్యూజిక్ కు ..అనంత్ శ్రీరామ్ మాటలు బాగా సెట్ అయ్యాయి. ఈ పాటలో ఏకంగా 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో కలిసి గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్న‌త్వానికి ఏక‌త్వమైన మ‌న దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్  రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద కళాకారులను ఈ పాటకు స్వరమందిచారు.


ఏపీలో గుసాడి, కొమ్ముకోయ , తప్పెటగుళ్లు లాంటి జానపద నృత్యాలతో పాటు వెస్ట్ బెంగాల్ కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిన గుమ్రా , రానప్ప , పైకా , దురవ వంటి వాటితో పాటు కర్ణాకటకు చెందిన హలారి , ఒక్క లిగ, గొరవర, కుణిత లాంటి డ్యాన్స్ మూవ్ లను భాగం చేశారు. ఈ పాటను బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్టెప్స్ కంపోజ్ చేశారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shankar-director game-changer ramcharan

Related Articles