Rain Alert: మరో నాలుగు రోజులు వానలే వానలు

రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 


Published Jul 27, 2024 12:21:30 AM
postImages/2024-07-27/1722044965_IMG20240727064055640x400pixel.jpg

న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల  రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

రానున్న నాలుగు రోజుల పాటు నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news hyderabad rains weather-report weather-update weather-forecast rain-alert latest-news news-updates telugu-news

Related Articles