మన ఇండియాలోని టాప్ డైరెక్టర్లలో రాజమౌళి కూడా ఒకరు. ఈయన డైరెక్షన్ లో సినిమా అంటే తప్పనిసరిగా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం ఉంటుంది. ఇప్పటివరకు అపజయం ఎరుగని డైరెక్టర్లలో
న్యూస్ లైన్ డెస్క్: మన ఇండియాలోని టాప్ డైరెక్టర్లలో రాజమౌళి కూడా ఒకరు. ఈయన డైరెక్షన్ లో సినిమా అంటే తప్పనిసరిగా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం ఉంటుంది. ఇప్పటివరకు అపజయం ఎరుగని డైరెక్టర్లలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారు. అలాంటి రాజమౌళి సినిమాల విషయంలో కొన్ని తప్పనిసరిగా పాటిస్తారు. ఆయన చిత్రాల్లో కొంతమంది నటులను తప్పనిసరిగా తీసుకుంటాడు. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో తప్పనిసరిగా కనిపించే నటుడు ఒకరు ఉన్నారు.
ఆయన లేని చిత్రాలు అసలు లేనే లేవు. ఇంతకీ ఆ నటుడు ఎవరయ్యా అంటే ఛత్రపతి శేఖర్. ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. జక్కన్న సినిమాలో చిన్న క్యారెక్టర్ దొరికిన జన్మ ధన్యము అవుతుందని భావించినట్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి జక్కన్న సినిమాలో నటుడికి మాత్రం తప్పనిసరిగా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈయన శాంతినివాసం అనే బుల్లితెర సీరియల్ ద్వారా ఇండస్ట్రీ లోకి వచ్చి త్రిబుల్ ఆర్ సినిమా వరకు రాజమౌళి చేసిన ప్రతి దాంట్లో ఏదో ఒక పాత్రలో కనిపిస్తూ ఉన్నారు.
ముఖ్యంగా స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, చత్రపతి, సై, మగధీర, మర్యాదరామన్న, ఆర్ఆర్ఆర్, ఈగ, విక్రమార్కుడు, ఇలా అనేక చిత్రాల్లో ఆయన కనిపిస్తారు. రాజమౌళి 12 సినిమాలు చేయగా ఇందులో తొమ్మిది చిత్రాల్లో శేఖర్ కీలక పాత్ర పోషించారు. చత్రపతి సినిమాలో హీరో స్నేహితుడిగా ఈయన పాత్ర హైలెట్ అవుతుంది. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈయనను చత్రపతి శేఖర్ గా అప్పటినుంచి పిలుస్తున్నారు. అలా రాజమౌళి ప్రతి సినిమాలో చత్రపతి శేఖర్ ఉండడం ఆనవాయితీగా వస్తోంది. మొదటి సీరియల్ ద్వారా ఏర్పడిన వీరి పరిచయం ఇప్పటికి కొనసాగుతూ వస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.