Rajashekar:స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గని రాజశేఖర్ కూతురు.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు నాగార్జున, చిరంజీవి,  వెంకటేష్, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు స్టార్ హీరోలుగా  కొనసాగారు.  ఇందులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ఇంకా కొనసాగుతూ ఉన్నారు. అంతేకాకుండా మోహన్ బాబు, రాజశేఖర్ ఏదైనా మంచి పాత్రలు ఉంటే చేస్తూ వస్తున్నారు. అలాంటి ఈ హీరోల వారసులు ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి ఫామ్ లో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో రాజశేఖర్ కూతురు కూడా ఉంది.


Published Jul 12, 2024 11:58:02 AM
postImages/2024-07-12//1720765682_rajashekar.png

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు నాగార్జున, చిరంజీవి,  వెంకటేష్, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు స్టార్ హీరోలుగా  కొనసాగారు.  ఇందులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ఇంకా కొనసాగుతూ ఉన్నారు. అంతేకాకుండా మోహన్ బాబు, రాజశేఖర్ ఏదైనా మంచి పాత్రలు ఉంటే చేస్తూ వస్తున్నారు. అలాంటి ఈ హీరోల వారసులు ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి ఫామ్ లో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో రాజశేఖర్ కూతురు కూడా ఉంది.

ఇప్పటికే ఒకటి రెండు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలను అరబోస్తూ ముందుకు వెళ్తోంది. రాజశేఖర్ కూతురు అందాలను చూడాలంటే మన రెండు కళ్ళు సరిపోవు.  అయితే అందం, అభినయం నటనా టాలెంట్ ఉన్నా కానీ ఈమెకు ఎక్కడో కాస్త అదృష్టం లేనట్టుంది. ఒకటి రెండు సినిమాల్లో నటించిన అవకాశాలు అందిపుచ్చుకోవడం లేదు.

అలాంటి ఈ అందాల తార తన హాట్ అందాలను బయట పెడుతూ ఎప్పటికప్పుడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మడు పేరు ఏంటయ్యా అంటే శివాని రాజశేఖర్. తన వారసురాలిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ  అద్భుతం, డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యూ వంటి చిత్రాలలో నటించింది. అంతేకాకుండా కోలీవుడ్ లో నెంజుక్కునీతి, అనుబారిపు వంటి సినిమాల్లో చేసింది. అంతేకాకుండా శ్రీకాంత్ హీరోగా వచ్చినటువంటి కోటబొమ్మాలి ఫిఎస్ లో శివాని రాజశేఖర్ నటనకు మంచి గుర్తింపు లభించింది.

అంతేకాకుండా రాజ్ తరుణ్ తో కూడా ఆహనా పెళ్ళంట వెబ్ సిరీస్   ఓటిటిలో మంచి వ్యూస్ లభించాయి. అలాంటి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా తన అందాల ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఈ విధంగా తెలుగు, తమిళంలో  చిన్న చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకోవాలని శతవిధాల ట్రై చేస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shivanni-rajashekar -rajashekar jeevitha kotabommali-ps

Related Articles