raj mouli: దేవర థియేటర్లో రాజమౌళి హంగామా..ఫుల్ ఎంజాయ్ చేశారు !

జక్కన్న దేవర మూవీకి సతీసమేతంగా వెళ్లారు. దేవర చూస్తూ హంగామా చేశారు. పనిలో పనిగా తన ప్రెజెన్స్ తో సినిమాకొచ్చిన జనాలను కూడా ఫుల్ ఎంజాయ్ చేసేలా చేశారు.


Published Sep 28, 2024 12:33:00 PM
postImages/2024-09-28/1727507051_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జక్కన్న తెలుగు ఇండస్ట్రీ సెన్సేషన్. అసలు సినిమా తప్ప మరో ప్రపంచం లేని వ్యక్తి. తన సినిమా కోసం ప్రాణం పెడతాడు..సరదా కోసం సినిమాలు చూస్తాడు. తన తోటి డైరక్టర్లు సినిమాలను ఏ మాత్రం ఈగో లేకుండా పొగడడానికి అసలు వెనుకాడరు. అయితే జక్కన్న దేవర మూవీకి సతీసమేతంగా వెళ్లారు. దేవర చూస్తూ హంగామా చేశారు. పనిలో పనిగా తన ప్రెజెన్స్ తో సినిమాకొచ్చిన జనాలను కూడా ఫుల్ ఎంజాయ్ చేసేలా చేశారు.


ఎన్టీఆర్‌ను.. తన బెస్ట్ ఫ్రెండ్‌ అని.. తన ఫస్ట్ హీరో అని.. ఎప్పుడూ చెబుతూ ఉండే.. జక్కన్న… తన బడ్డీ సినిమా చేసేందుకు ఎర్లీ మార్నింగే.. దేవర థియేటర్‌కు వచ్చేశారు. ఏ సినిమా అయినా తన ఫస్ట్ ఆప్షన్ తారక్ అని అంటుంటారు. తారక్ లో ఆ నాటీ నెస్ తనకు చాలా ఇష్టమని కూడా అంటుంటారు. థియేటర్ లో తనను చూసి అరిచి గోల గోల చేస్తున్న ఫ్యాన్స్ ను చూసి పలకరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.


తన సినిమా ఆర్ ఆర్ ఆర్ తర్వాత తారక్ మానియా పెరిగింది. బాలీవుడ్ లో కాస్త మార్కెట్ పెరిగింది. అయితే ఆర్ ఆర్ ఆర్ రేంజ్ తర్వాత పడే సినిమా ఎలా ఉంటుందో చూడాలనుకున్న జనాలకు దేవర మంచి బూస్టింగ్ సినిమా అయ్యింది. కలక్షన్స్ తో దూసుకుపోతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr rrr devara ss-rajamouli

Related Articles