కిరాక్ ఆర్పి జబర్దస్త్ అనే రియాలిటీ షో ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈయన కామెడీ, డైలాగ్ డెలివరీ, పంచులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అలాంటి ఆర్పి కామెడీ ద్వారా ఎంతో ఫేమస్ అయిపోయి, ఆ తర్వాత
న్యూస్ లైన్ డెస్క్: కిరాక్ ఆర్పి జబర్దస్త్ అనే రియాలిటీ షో ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈయన కామెడీ, డైలాగ్ డెలివరీ, పంచులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అలాంటి ఆర్పి కామెడీ ద్వారా ఎంతో ఫేమస్ అయిపోయి, ఆ తర్వాత హైదరాబాదులోని నెల్లూరు చేపల పులుసు అనే వ్యాపారం పెట్టి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ విధంగా సినిమా, వ్యాపారాలు, రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి ఆర్పి తన వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త ఫెయిల్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..
అయితే కిరాక్ ఆర్పి తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.. అయితే కిరాక్ ఆర్పి జబర్దస్త్ చేస్తున్న సమయంలోనే తన తోటి నటి లక్ష్మీ ప్రసన్న పరిచయమైంది. అలా ఇద్దరు ప్రేమించుకుని కొద్ది రోజుల తర్వాత ఈ విషయాన్ని కుటుంబాలతో చెప్పి చివరికి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే లక్ష్మీ ప్రసన్నకు బాయ్ ఫ్రెండ్ ఉండేవారని అనేక వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లి తర్వాత కిరాక్ ఆర్పి ఆమెతో కొన్నాళ్లపాటు బాగానే ఉన్న ఆ తర్వాత పనుల బిజీ వల్ల కాస్త పట్టించుకోవడం మానేశారట. అంతేకాదు లేనిపోని రాజకీయ వివాదాల్లో కూడా ఆర్పి వేలు పెట్టడంతో ఆమె చాలాసార్లు అలా చేయకని చెప్పి చూసిందట.
అయినా ఆర్పి వినకుండా ఆమెను కనీసం పట్టించుకోకుండా తిరుగుతూ ఉండడంతో లక్ష్మీ తన పాత బాయ్ ఫ్రెండ్ తో మళ్లీ చనువుగా ఉండడం మొదలు పెట్టిందని తెలుస్తోంది. అలా వారి పెళ్లి తర్వాత ఆమె ఆయనను కలవడానికి వెళ్లిందని, ఈ విషయం తెలుసుకున్న ఆర్పి ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అయినా తన క్యారెక్టర్ మార్చుకోకపోవడంతో కిరాక్ ఆర్పి విడాకులకు సిద్ధమైనట్టు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
అంతేకాదు లక్ష్మీ ప్రసన్నకు పిల్లలు అంటే ఇష్టమని, కానీ ఆర్.పి ఆ కోరిక తీర్చడం లేదని, ఆయనకు అసలు మ్యాటర్ లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ విధంగా ఆర్పి వ్యవహారాన్ని సోషల్ మీడియాలో చిలువలు పలువలుగా వార్తలు రాస్తూ చర్చ కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆర్పి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.?