జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసినటువంటి దేవర చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాంటి దేవర
న్యూస్ లైన్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసినటువంటి దేవర చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాంటి దేవర చిత్రం చూసిన ప్రతి ఒక్కరు బ్లాక్ బాస్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ విధంగా మంచి అభిప్రాయాన్ని సొంతం చేసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ మూవీ కోసం నటీనటులు రెమ్యూనరేషన్ బాగానే తీసుకున్నారట.
ఇందులో ప్రధానంగా కొరటాల శివ కూడా అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దేవర చిత్రంలో ఎవరు ఎంత తీసుకున్నారు వివరాలు ఏంటో చూద్దాం.. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి దేవర మూవీ మొదటి రోజు 172 కోట్లు వసూలు చేసిందని ఇప్పటికే చిత్ర యూనిట్ బయట పెట్టేసింది.. అఫీషియల్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని చెప్పింది.
ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే దాదాపు ఇంకో 150 కోట్లు వసూలు చేస్తే సరిపోతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మాత్రం బ్రేక్ ఈవెన్ దాటి ఇంకా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా హిట్టు టాక్ తో దూసుకుపోతున్న దేవర మూవీకి ఎవరు ఎంతెంత తీసుకున్నారు అనే వివరాలు చూద్దాం.. మొత్తం 300 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీకి ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు.
అయితే ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ 60 కోట్లు, జాన్వి కపూర్ ఐదు కోట్లు, సైఫ్ ఆలీలీ ఖాన్ 10 కోట్లు. ఇతర కీలక పాత్రలో నటించినటువంటి ప్రకాష్ రాజు 1.5 కోట్లు, హీరో శ్రీకాంత్ యాభై లక్షలు, మురళీ వర్మ 40 లక్షలు తీసుకున్నారట. ఇక ఇందులో మరో కీలక భాగం దర్శకుడు కొరటాల శివ, ఈయన ఏకంగా 30 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారట.