హీరో రజినీకాంత్ పాన్ ఇండియా సినిమాలు రాకముందే పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్న హీరో. ఈయన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: హీరో రజినీకాంత్ పాన్ ఇండియా సినిమాలు రాకముందే పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్న హీరో. ఈయన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి రజినీకాంత్ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన స్టైల్ తో, మేనరిజంతో గొప్ప హీరోగా ఎదిగాడు. అందం, సరైన ఆకృతి లేకపోయినా తన నటన టాలెంట్ తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.
అలాంటి తలైవా అంటే ఇప్పటికి ఎంతోమంది ఆదరిస్తారు. మరి ఈ విధంగా రజనీకాంత్ ఇంతటి స్థాయికి రావడానికి ఆయన వెంట ఒకరు ఉన్నారట. చివరికి తన గోల్డ్ చైన్ అమ్ముకొని మరి రజినీకాంత్ హీరో అయ్యేలా ప్రోత్సహించారట. ఆయనెవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. రజనీకాంత్ మొదట్లో బెంగళూరు సిటీ బస్సులో కండక్టర్ గా పని చేసేవారట. తన స్టైల్ తో బస్సులో వారందరినీ ఎంటర్టైన్ చేసేవారట. ఆయన టాలెంట్ చూసినటువంటి తన స్నేహితులు బంధువులు నువ్వు సినిమాల్లో ట్రై చెయ్ సెట్ అవుతావని చెప్పారట.
అలా వారి మాట ప్రకారం మద్రాసు వెళ్లి సినిమాల్లో ట్రై చేస్తూ ఆర్థికంగా రజనీకాంత్ చాలా ఇబ్బందులు పడ్డారట. ఆ సమయంలో ఆయనకి ఎవరూ సాయం చేయలేదట కానీ తన స్నేహితుల్లో ఒక్కరు మాత్రం చివరికి తన గోల్డ్ చైన్ అమ్మి మరీ రజనీకాంత్ కు ప్రోత్సాహం అందించారట. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే బహదూర్. ఈ విధంగా బహుదూర్ తన జీవితంలో సగభాగం కంటే ఎక్కువ డబ్బులు రజనీకాంత్ కు పంపారట. ఒకానొక సమయంలో డబ్బులు అడ్జస్ట్ కాకపోయేసరికి బంగారపు చైను ఎవరికో అమ్మి ఆ డబ్బులు రజనీకాంత్ కి ఇచ్చి నువ్వు కచ్చితంగా పెద్ద హీరో అవుతావు రా అంటూ ప్రోత్సహించారట.
బహదూర్ సహకారం వల్లే రజనీకాంత్ చాలా పెద్ద హీరో అయ్యారు. మరి రజనీకాంత్ అంతటి స్థాయికి వెళ్లిన తర్వాత బహదూర్ ఏమైనా అతని నుంచి ఆశించారా అంటే అది కూడా లేదట. తాను తన జీతం మీదనే రిటైర్డ్ అయ్యే వరకు బ్రతికారట. రజనీకాంత్ ఎన్నిసార్లు ఎంత డబ్బు ఇస్తానన్నా తీసుకోలేదట. మన స్నేహాన్ని నువ్వు డబ్బుతో కొనగలవా అంటూ చెబుతుంటారంట. అలా రజినీకాంత్ అత్యంత ఆప్తుడైన స్నేహితుడు బహదూర్ అని, ఇప్పటికే వీరిద్దరూ తరచూ కలుస్తుంటారని తెలుస్తోంది.