హీరో కార్తీ అరవింద స్వామి ముఖ్యపాత్రలో ది గ్రేట్ డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ సత్యం సుందరం.. ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి లవ్ స్టోరీ తో ఎంతోమందిని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని
న్యూస్ లైన్ డెస్క్: హీరో కార్తీ అరవింద స్వామి ముఖ్యపాత్రలో ది గ్రేట్ డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ సత్యం సుందరం.. ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి లవ్ స్టోరీ తో ఎంతోమందిని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పవచ్చు. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు భావోద్వేగానికి గురికాక తప్పదు. ఈ సినిమాని హీరో సూర్య హీరోయిన్ జ్యోతిక దంపతులు నిర్మించారు. అలాంటి ఈ చిత్రం సెప్టెంబర్ 28 న రిలీజయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా కథ ఏంటి.. పూర్తి వివరాలు చూద్దాం..
స్టోరీ:
పల్లెటూరు నుంచి సిటీకి వెళ్లినటువంటి ఫ్యామిలీ తన సొంత ఊరిలో మోసపోయిన విధానంపై సినిమా నడుస్తుంది.. ఇందులో సత్యమూర్తి అలియాస్ సత్యం పాత్రలో అరవింద స్వామి చేస్తారు. ఇందులో సత్యం గుంటూరు దగ్గరలోని ఉద్దండరాయిని పాలెం కు చెందిన వ్యక్తి. ఆయనకు తన సొంత ఊరు అన్నా తన తాతల కాలంనాటి ఇళ్లన్నా చాలా ఇష్టం.. అయితే ఆయన చిన్నతనంలోనే సొంత బంధువులు తనను మోసం చేసి ఆ ఇల్లును వాళ్లు లాక్కుంటారు. దీంతో సత్యం ఫ్యామిలీ ఆ ఊరును వదిలేసి వైజాగ్ వెళ్ళిపోతుంది.
అలా 30 సంవత్సరాలు గడిచిన తర్వాత ఓసారి తన బాబాయ్ కూతురు పెళ్లి కోసం సత్యం ఆ ఊరికి వస్తాడు.. ఈ టైంలోనే వారి యొక్క బంధువులు అందరూ కలుస్తారు. అందులో సత్యంను ఒక వ్యక్తి బావ బావ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు హీరో కార్తీ.. అయితే సత్యం చాలా ఏళ్ల తర్వాత ఊరికి వస్తాడు కాబట్టి కార్తీ ఎవరో గుర్తుపట్టలేక పోతాడు. బావ ని దగ్గరికి రాగానే గుర్తుపట్టినట్టు యాక్టింగ్ చేస్తాడు. ఈ విధంగా కార్తీ సత్యంతో మితిమీరిన కలుపుగోలు తనంతో ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది. ఇలా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించే పూర్తి సినిమా సాగుతుంది. ఇద్దరు కలిసి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తారు.. ఇందులో కార్తీ సత్యంను బావ అని పిలిచే బంధం వెనుక రిలేషన్ ఏంటి అనేది పూర్తిగా సినిమా చూస్తే అర్థమవుతుంది..
ఎలా ఉందంటే:
ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక బుక్ లోని కథ చదివినట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా చాలామంది పల్లెటూరు వదిలి సిటీలో బ్రతుకుతున్నారు. అలాంటి వారు సినిమా చూస్తే వెంటనే వారి ఊరికి వెళ్లాలనే ఆలోచన పుడుతుంది. ఈ విధంగా సినిమాను అన్ని హంగులతో అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్. ఈ సినిమా చూస్తూనంత సేపు మనం మన ఊరిని మన బంధువులను తప్పక గుర్తు చేసుకుంటాం. అంతేకాకుండా మధ్య మధ్యలో కామెడీ ఆకట్టుకుంటుంది. ఇక సినిమా క్లైమాక్స్ లో కార్తీ తన పాత్రను పూర్తిగా బయటపెట్టే తీరు తనకు సత్యానికి మధ్య ఉన్నటువంటి ఫోన్ సంభాషణ అందరిని ఆకట్టుకుంటుంది.
నటీనటుల పనితీరు:
అరవింద స్వామి కార్తిల నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నటించడం కాదు పూర్తిగా జీవించారు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు మరో ఆకర్షణ అని చెప్పవచ్చు. సినిమా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్ని హంగులు కలగలిపి వచ్చిందని తెలుస్తోంది.
ఫైనల్ రిజల్ట్:
ఫ్యామిలీతో కలిసి అందరూ తప్పక చూడవలసిన చిత్రం.