Rambha: ఆ హీరోయిన్లకు పొగరు ఎక్కువ..!!

సీనియర్ నటి రంభ ఒకప్పుడు ఎన్నో ఇండస్ట్రీలలో తన అందం అభియంతో ఒక ఊపు ఊపింది.ఆ ఒక్కటి అడక్కు మూవీతో సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత చిరంజీవి,బాలకృష్ణ,వెంకటేష్ వంటి ఎంతోమంది స్టార్ హీరోలతో జతకట్టింది. అయితే రంభ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ హీరోయిన్లకు పొగరు ఎక్కువ అంటూ కామెంట్స్ చేసింది. ఇక విషయం ఏమిటంటే.. రంభ కి ఇష్టమైన హీరోయిన్లు సౌందర్య, త్రిషలట.అలాగే రమ్యకృష్ణ ని చూస్తే కాస్త భయం వేస్తుందని, ఎందుకంటే ఆమె తన కంటే కాస్త సీనియర్ కాబట్టి ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే భయం ఉండేదని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.అంతేకాకుండా ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది హీరోయిన్లు ఏదైనా ఫంక్షన్ లో లేదా బయట ఎక్కడైనా కలిస్తే నేను ఎవరో తెలియదు అన్నట్లే ప్రవర్తిస్తూ కనీసం పలకరించకుండా వెళ్లిపోతారు. వారికి ఆటిట్యూడ్ ఎక్కువ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది రంభ. కానీ రంభ ఏ హీరోయిన్లను అన్నదో వారి పేర్లు మాత్రం బయట పెట్టలేదు


Published Jun 29, 2024 03:56:00 PM
postImages/2024-06-29/1719655049_rambha.jpg

న్యూస్ లైన్ డెస్క్: సీనియర్ నటి రంభ ఒకప్పుడు ఎన్నో ఇండస్ట్రీలలో తన అందం అభియంతో ఒక ఊపు ఊపింది. ఇక ఇప్పటి జనరేషన్ లో శ్రీలీల ఎలా అయితే రెండు మూడు సినిమాలతోనే పాపులర్ అయిపోయిందో అప్పట్లో రంభ కూడా అలాగే పాపులర్ అయిపోయింది. కామెడీ హీరో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ఆ ఒక్కటి అడక్కు మూవీతో సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత చిరంజీవి,బాలకృష్ణ,వెంకటేష్ వంటి ఎంతోమంది స్టార్ హీరోలతో జతకట్టింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో కూడా చేసింది.  

ఇక చాలా మంది హీరోయిన్లు అవకాశాలు తగ్గడంతో పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కని మళ్ళీ తర్వాత ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లేమో సినిమాల్లోకి రారు.సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటూ ఇంటర్వ్యూ లు ఇస్తూ అభిమానుల్లో  ఉంటారు. అయితే రంభ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ హీరోయిన్లకు పొగరు ఎక్కువ అంటూ కామెంట్స్ చేసింది. ఇక విషయం ఏమిటంటే.. రంభ కి ఇష్టమైన హీరోయిన్లు సౌందర్య, త్రిషలట.

అలాగే రమ్యకృష్ణ ని చూస్తే కాస్త భయం వేస్తుందని, ఎందుకంటే ఆమె తన కంటే కాస్త సీనియర్ కాబట్టి ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే భయం ఉండేదని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే తనకి ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరని చెప్పింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది హీరోయిన్లు ఏదైనా ఫంక్షన్ లో లేదా బయట ఎక్కడైనా కలిస్తే నేను ఎవరో తెలియదు అన్నట్లే ప్రవర్తిస్తూ కనీసం పలకరించకుండా వెళ్లిపోతారు. వారికి ఆటిట్యూడ్ ఎక్కువ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది రంభ. కానీ రంభ ఏ హీరోయిన్లను అన్నదో వారి పేర్లు మాత్రం బయట పెట్టలేదు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ramyakrishna sreeleela ramba soundarya trisha

Related Articles