ఇండస్ట్రీలో 90S హీరోయిన్స్ అంటే చాలామంది గుర్తుకు వచ్చేది రమ్యకృష్ణ, రోజా, సౌందర్య, ఆమని, జయసుధ, వంటి వారు ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రమ్యకృష్ణ. ఈమె
న్యూస్ లైన్ డెస్క్: ఇండస్ట్రీలో 90S హీరోయిన్స్ అంటే చాలామంది గుర్తుకు వచ్చేది రమ్యకృష్ణ, రోజా, సౌందర్య, ఆమని, జయసుధ, వంటి వారు ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రమ్యకృష్ణ. ఈమె ఇప్పటికే ఐదు పదుల వయస్సు దాటింది. అయినా 20 ఏళ్ల యంగ్ అమ్మాయిల కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికి సినిమాల్లో తల్లి, వదిన క్యారెక్టర్లు చేసుకుంటూ దూసుకుపోతోంది. అలాంటి రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలంటే కాస్త ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అంటుంటారు. దీనిపై చాలామంది స్టార్ హీరోయిన్స్ అయిన వారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇలాంటి కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. హీరోయిన్స్ స్టార్స్ అవ్వాలంటే బెడ్ రూమ్ కి వెళ్లాల్సిందే అంటూ సంచలన కామెంట్లు చేశారు. 1990 నుంచి ఇండస్ట్రీలో దూసుకుపోతున్న రమ్యకృష్ణ తనదైన ముద్ర వేసుకొని ఇంకా చిత్రాల్లో నటిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ, భాషల్లో కూడా ఈమె అనేక చిత్రాల్లో నటించింది. అలాంటి రమ్యకృష్ణ తన సినీ కెరియర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందింది.
అయితే ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొస్తూ కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇతర రంగాలలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉన్నదని అన్నది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మహిళలు స్టార్ కావాలంటే అప్పుడప్పుడు రాజీ పడాల్సి ఉంటుందని తెలియజేసింది. నిర్మాతలు, దర్శకుల యొక్క కోరికలు తీర్చాలి అన్నది. అప్పుడప్పుడు వారి బెడ్ రూమ్ కి వెళ్తేనే నటులుగా ఎదుగుతారని రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంత పెద్ద హీరోయినే ఈ విధంగా మాట్లాడుతుందంటే ఇక సాధారణ హీరోయిన్ల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.