Raviteja:అప్పటి రవితేజ లవర్..'మిస్టర్ బచ్చన్' లో చేసిందా..ఈ బ్యూటీ ఎలా మారిందంటే.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ హీరో అంటే రవితేజ అని చెప్పవచ్చు.  కామెడీ, యాక్షన్, లవ్, ఎమోషనల్ ఇలా ఏ క్యారెక్టర్ లో అయినా దూసుకుపోగల సత్తా ఉన్న హీరో. అలాంటి రవితేజ


Published Aug 21, 2024 01:05:13 PM
postImages/2024-08-21/1724225713_manichandana.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ హీరో అంటే రవితేజ అని చెప్పవచ్చు.  కామెడీ, యాక్షన్, లవ్, ఎమోషనల్ ఇలా ఏ క్యారెక్టర్ లో అయినా దూసుకుపోగల సత్తా ఉన్న హీరో. అలాంటి రవితేజ  ఇప్పటికీ ఐదు పదుల వయస్సు దాటినా కానీ సినిమాల్లో కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఆయన మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా  మన ముందుకు వచ్చారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో  ఆగస్టు 15వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది.

అయితే ఇందులో రవితేజ ఎనర్జీ ఎంతో చూపించినప్పటికీ డైరెక్టర్ మాత్రం సినిమాలు తెరకెక్కించడంలో విఫలమయ్యారని టాక్ వినిపిస్తోంది. అలాంటి ఈ చిత్రంలో ఒకప్పటి రవితేజ లవర్ గా కూడా నటించింది. ఆమె ఎవరు ఆ వివరాలు చూద్దాం.. అప్పట్లో రవితేజ హీరోగా మనసిచ్చాను సినిమా  వచ్చింది. ఈ చిత్రంలో రవితేజ  సరసన మణిచందన అనే అమ్మాయి నటించింది.

ఈ సినిమానే కాకుండా తొలిప్రేమ చిత్రంలో కూడా కీర్తి రెడ్డి ఫ్రెండ్ గా కనిపించింది. ఆ తర్వాత పిల్ల నచ్చింది అనే చిత్రంలో బ్రహ్మానందం భార్యగా చేసింది. అంతేకాకుండా మహేష్ బాబు హీరోగా వచ్చిన నిజం చిత్రంలో ఒక ఐటెం సాంగ్ లో కూడా చేసింది. ఇలా ఇండస్ట్రీలో ఓ మోస్తారుగా రాణిస్తున్న ఈమె మనసిచ్చాను సినిమాలో  రవితేజకు లవర్ గా చేసి మంచి గుర్తింపు పొందింది.

https://www.instagram.com/p/C50Ni9uJUYu/?igsh=NGo2empkNzg1bGph

అలాంటి ఈ బ్యూటీ మిస్టర్ బచ్చన్ సినిమాలో  జగపతిబాబుకు భార్యగా  చేసి అందరినీ ఆకట్టుకుంది. ఇందులో రవితేజ మణిచందన మధ్య అనేక సీన్స్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు రవితేజ లవర్ గా ఉన్న ఈమె ప్రస్తుతం  ఈ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడంతో , ఈమె రవితేజ లవర్ కదా అంటూ  కొన్ని వార్తలు రాస్తున్నారు. ప్రస్తుతం ఆమెకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu raviteja harish-shankar jagapathi-babu mr-bachchan manichandana

Related Articles