Renu Desai:భారతీయుడు2 ప్లాప్ అయినందుకు సంతోషంగా ఉంది.!

ఇండియా మొత్తంలో టాప్ 5 దర్శకుల్లో  శంకర్ కూడా ఒకరు. ఆయన డైరెక్షన్ లో సినిమా అంటే ఏ హీరో అయినా నో చెప్పరు. ఎందుకంటే ఆయన డైరెక్షన్ అలా ఉంటుంది.  ఈయనతో సినిమా చేసిన ఏ


Published Sep 07, 2024 01:31:00 PM
postImages/2024-09-07/1725695313_renudesai.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఇండియా మొత్తంలో టాప్ 5 దర్శకుల్లో  శంకర్ కూడా ఒకరు. ఆయన డైరెక్షన్ లో సినిమా అంటే ఏ హీరో అయినా నో చెప్పరు. ఎందుకంటే ఆయన డైరెక్షన్ అలా ఉంటుంది.  ఈయనతో సినిమా చేసిన ఏ హీరో హీరోయిన్ ఇతర నటినటులు ఎవరైనా సరే ఇండస్ట్రీలో తిరుగులేకుండా దూసుకుపోతారు. అలాంటి గ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ చేసినటువంటి భారతీయుడు సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాకు సీక్వల్ గా వచ్చినటువంటి భారతీయుడు2 సినిమా కూడా అనేక అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది.

కానీ అనుకున్న అంచనాలను మాత్రం రీచ్ కాలేకపోయింది. చివరికి సినిమా దారుణంగా ఫ్లాప్ అయిపోయింది. దీంతో శంకర్ ను చాలామంది విమర్శించారు.  భారతీయ చిత్ర పరిశ్రమను ఎల్లలు దాటినటువంటి శంకర్ కు ఏమైంది.  ఈ సినిమాను ఇలా తీసారేంటి అంటూ చాలామంది సినీ లవర్స్ తిట్టుకున్నారు. అంతేకాదు ఇండియన్ 2 సినిమాలో కొన్ని డైలాగ్స్ ఫెట్ లవర్స్ కి ఆగ్రహానికి గురిచేసాయి. అలాంటి ఈ ఇష్యుపై నటి రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడింది.

అసలు ఈ రైటర్స్ ఇలాంటి సంభాషణలు ఏ విధంగా రాస్తారు అని కోపగించుకుంది. ఇలాంటి డైలాగ్స్ పెట్టినందుకు ఈ సినిమా ప్లాఫ్ అయింది. సినిమా డిజాస్టర్ అయినందుకు నాకు చాలా ఆనందం వేసింది  అంటూ చెప్పుకొచ్చింది.  ఇందులో కమలహాసన్ వీధి కుక్కలని కించపరిచే విధంగా చెప్పే డైలాగ్స్ తాలూకు క్లిప్పును ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ  ఇట్లాంటి డైలాగ్స్ ఉన్న సినిమాలు ఫ్లాప్ అయితేనే మంచిది అంటూ అది ఫ్లాప్ అయినందుకు నిన్ను సంతోషిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

ఈ విధంగా రేణు దేశాయ్ అనడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అంత ఖర్చు పెట్టి  తీసిన సినిమాలు ఫ్లాప్ అయినందుకు సంతోష పడతావా నువ్వు సినీ ఇండస్ట్రీలో పనిచేసావు కదా నీకు ఇలాంటి బుద్ధి ఏంటి అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu renu-desai bharathiyudu-2 shankar-director

Related Articles