పలు అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో టెలికాం సేవల విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు.
న్యూస్ లైన్ డెస్క్: కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎం గురువారం ఆయనను కలిసి మాట్లాడారు. పలు అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో టెలికాం సేవల విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు.
టీ-ఫైబర్ ప్రాజెక్ట్‌ను భారత్ నెట్ ఫేజ్-3గా మార్చేందుకు ఇచ్చిన డీపీఆర్‌ను ఆమోదించాలని సింధియాను కోరారు. భారత్ నెట్ ఉద్యమి ప్రోత్సాహక పథకాన్ని టీ-ఫైబర్‌కు వర్తింపజేయాలని రేవంత్ భట్టి ఆయనకు వినతి పత్రం అందజేశారు. టీ-ఫైబర్‌కు రూ.1,779 కోట్ల వడ్డీలేని రుణాన్ని ఇవ్వాలని సీఎం రేవంత్ సింధియాను కోరారు.