CM Revanth: రేవంత్ రెడ్డి కుర్చీని లేపేశారా..!?

సమావేశం విషయం పక్కన పెడితే.. రేవంత్ కుర్చీని లేపేశారనే ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 


Published Aug 30, 2024 04:42:33 AM
postImages/2024-08-30/1725003816_Revanthsittingonchair.jpg

న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి కుర్చీని లేపేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. మిలాద్-ఉన్-న‌బీ ప్ర‌ద‌ర్శ‌న‌ ఏర్పాట్లపై గురువారం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సచివాలయంలో స‌మీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి హైదరాబాద్ ఎమ్మెల్యేలు అక్బ‌రుద్దీన్ ఓవైసీ తప్ప ఒక్కరు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. అయితే, సెప్టెంబ‌రు 7 నుంచి గ‌ణేష్ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు, 17న నిమ‌జ్జ‌నం జరగనున్నాయి. దీంతో మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలను వాయిదా వేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. 

అయితే, సమావేశం విషయం పక్కన పెడితే.. రేవంత్ కుర్చీని లేపేశారనే ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే.. అందరూ కూర్చున్న కుర్చీలతో పోలిస్తే రేవంత్ రెడ్డి కూర్చున్న కూర్చు కాస్త ఎత్తుగా కనిపిస్తోంది. సీఎం కాబట్టి ఎత్తులో ఉండాలని అనుకున్నారో.. లేదా సీఎంకు సెపెరేట్ కుర్చీ వేశారో తెలియదు కానీ, రేవంత్ మాత్రం కుర్చీలో కూర్చున్నప్పటికీ అందరికన్నా ఎత్తుగా కనిపిస్తున్నారు. దీంతో 'రేవంత్ కుర్చీని లేపేశారు..!' అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news news-line newslinetelugu telanganam cm-revanth-reddy revanth cm-revanthreddy

Related Articles