వివాదాల డైరెక్టర్ ఆర్జీవి ఏం మాట్లాడినా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయనకు వివాదాల డైరెక్టర్ అని కూడా పేరు వచ్చింది. అలాంటి ఆర్జీవి ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా, ఎవరికి భయపడకుండా చెబుతూ
న్యూస్ లైన్ డెస్క్: వివాదాల డైరెక్టర్ ఆర్జీవి ఏం మాట్లాడినా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయనకు వివాదాల డైరెక్టర్ అని కూడా పేరు వచ్చింది. అలాంటి ఆర్జీవి ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా, ఎవరికి భయపడకుండా చెబుతూ ఉంటారు. అయితే ఆయన ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సినిమాలపై కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. త్వరలో హీరో రణ్బీర్ కపూర్ సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో రామాయణం మూవీ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై రాంగోపాల్ వర్మ కామెంట్స్ చేశారు.
పురాణ గాథల ఆధారంగా రూపొందే సినిమాలు చేయడం అంతా ఈజీ పని కాదని అన్నారు. సీనియర్ నటుడు ఎన్టీఆర్ ఉన్న కాలంలోనే ఈ చిత్రాలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంతేకాదు ఇలాంటి చిత్రాలు వస్తే అప్పట్లో చాలామంది చూసేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఈ సినిమాలు చూసేవారు తక్కువైపోయారు. కొంతమంది దేవుడు సినిమాలు వస్తే భక్తితో చూస్తున్నారు తప్ప ఇంకో విషయం అయితే లేదు. అంతేకాదు ఈ చిత్రాలలో ఏదైనా రాంగ్ చూపిస్తే మాత్రం తప్పకుండా ఆ దేవుడికి సంబంధించినటువంటి మత పెద్దలు స్పందిస్తున్నారు. కొన్ని కొన్నిచోట్ల కేసులు కూడా వేసి తప్పుగా చిత్రీకరించారని ఆరోపణలు చేస్తున్నారు.
అందుకే అలాంటి చిత్రాలు తీయడానికి నేను అస్సలు సాహసం చేయను. సినిమా తీస్తే హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా అనేది పక్కన పెడితే లేనిపోని పంచాయతీలు ఎక్కువైపోయి ఒకరికొకరికి విభేదాలు కూడా పెరుగుతాయి. ఇందులో మనకు వచ్చేది ఏమీ ఉండదని ఆయన అన్నారు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా ద్వారా ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి.
కాబట్టి సోషియో ఫాంటసీ ఉన్న చిత్రాలు చేయడానికి నాకు అసలు ఇష్టం ఉండదు. కానీ ఇది చేసే వారికి చాలా ధైర్యం. ఇలాంటి చిత్రాలు చేసే వారందరికీ నేను ఆల్ ద బెస్ట్ చెబుతున్నారని అన్నారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.