Telangana: కత్తి సాములో ..మరో ఝాన్సీ లక్ష్మీ భాయ్ !

కత్తి సాము లో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తూ అబ్బుర పరుస్తోంది ఓ బాలిక. మరో ఝూన్సీ తెలుగు నేలపై మరలా పుట్టింది.


Published Nov 25, 2024 09:28:00 PM
postImages/2024-11-25/1732550349_kodadgirlexcelsinfencin.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  కత్తి సాము..ఇప్పుడు తరం నేర్చుకోవల్సిన విద్య...కరాటే , కంఫూ తర్వాత భారత్ లో పుట్టిన కత్తి సాముకు ఆదరణ పెరుగుతుంది. కత్తి సాము లో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తూ అబ్బుర పరుస్తోంది ఓ బాలిక. మరో ఝూన్సీ తెలుగు నేలపై మరలా పుట్టింది. . సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో 1923 నవంబర్‌ 16 తేదీన కాంతారావు జన్మించారు. ఇదే గ్రామానికి చెందిన ఓ చిన్నారి కత్తి పట్టి జాతీయస్థాయిలో కత్తి సాము క్రీడలో రాణిస్తోంది. 


గుడిబండకు చెందిన వెంకటేశ్వర్లు.. హైదరాబాదులో హోంగార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు.  తండ్రి వెంకటేశ్వర్లుకు కూడా కత్తి సాము అంటే ఎంతో ఇష్టం. ప్రపంచంలోనే అత్యంత  ఖరీదైన విద్య ఇది. క్రీడల్లో కుటుంబ ఆర్ధిక పరిస్థితులు కూడా సహకరించాలి. అప్పుడే మెడల్స్ ..గుర్తింపు. అయితే వెంకటేశ్వర్లకు కత్తి సాము విద్య పై చాలా ఇంట్రస్ట్ కాని కటుంబ పరిస్థితులు అసలు సహకరించక నేర్చుకోలేకపోయారు. 


వెంకటేశ్వర్లకు చరితశ్రీ అనే కూతురు 9వ తరగతి చదువుతోంది. చరితశ్రీ చిన్నతనం నుంచే తండ్రి నుంచి కత్తిసాములో ప్రేరణ పొందింది. హైదరాబాదులో చదువుతున్న చరితశ్రీ.. సూరజ్‌ నవీన్‌ అనే కోచ్ వద్ద రెండేళ్లుగా ఫెన్సింగ్‌ ఆటలో శిక్షణ పొందుతోంది. ఫిజికల్ గా ఫిట్ ..హైట్ ..వెయిట్ పర్ఫెక్ట్ గా ఉండడంతో ఈ విద్య తనకు ఇంకా ఎక్కువ ఉపయోగపడింది. జాతీయ స్థాయి పోటీల వరకు తీసుకొని వెళ్లింది.


ఏపీ రాజమండ్రి లో జరిగిన జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ తరపున పాల్గొని కాంస్యపతాకాన్ని సొంతం చేసుకుంది. డిసెంబరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో మరోసారి సత్తా చాటేందుకు చరిత శ్రీ తీవ్రంగా శ్రమిస్తోంది. తన తండ్రి కలను సాకారం చేయడానికి కత్తి పట్టిన చిన్నారి నేడు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తూ రాష్ట్రం తరఫున పాల్గొని అవార్డులు సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో పతకాల పంట పండించి.. అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. కత్తి కాంతారావు కూడా తమ గ్రామాకి చెందిన వారే. ఆయనే తనకు స్పూర్తి  అంటూ తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu

Related Articles