ట్విట్టర్ లో మీ ఫిజికల్ ఫిట్ నెస్ కు ఎలా టైం మ్యానేజ్ చేసుకోవాలో శ్రీకాంత్ మిరియాల చాలా చక్కగా తెలిపారు .. హెల్దీ లైఫ్ స్టైల్ కు మార్గాలేంటో చూసేద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తొమ్మిది గంటలకు నిద్రపోవడం ...తెల్లవారే నిద్ర లేవడం ..రెండు డ్రమటిక్ లైన్సే ఈ రోజుల్లో . ఏదో పుస్తకం లో చెప్పినట్లు ..మా జీవితం మొదలయ్యేదే రాత్రి పూట..పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి 8 గంటలకు ఆఫీస్ పనులు అయిపోయే వరకు ఉరుకుల పరుగుల జీవితం...మనకు ప్రశాతంగా దొరికే టైం ఆరాత్రి 8 నుంచి 11 వరకే..ఇక ఫిజికల్ ఫిట్ నెస్ ..హెల్దీ లైఫ్ స్టైల్ ఇవన్నీ ...షో ఆఫ్ మాటలే . కాని పొద్దున్నే లేస్తే ఎంత ఉపయోగమో ...ట్విట్టర్ లో మీ ఫిజికల్ ఫిట్ నెస్ కు ఎలా టైం మ్యానేజ్ చేసుకోవాలో శ్రీకాంత్ మిరియాల చాలా చక్కగా తెలిపారు .. హెల్దీ లైఫ్ స్టైల్ కు మార్గాలేంటో చూసేద్దాం.
1. వ్యాయామానికి సమయం దొరుకుతుంది. పొద్దున్న చేసిన వ్యాయామం రోజంతా మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతుంది.
2. సాధారణంగా మనకి అర్థం కాక, పరిష్కారాలు తెలీని కొన్ని సమస్యలకి, చిక్కుముడులకి మంచి నిద్ర తర్వాత ఒక చక్కని ఆలోచనతో పరిష్కారం దొరుకుతుంది.
3. ఇలా పొద్దున్నే లేచినప్పుడు ఒంట్లో సహజ స్టెరాయిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి, అవి ఏ పనినైనా ఉల్లాసంగా చేసేందుకు ఉపకరిస్తాయి.
4. అలాగే ఈ సమయంలో అప్పుడే విశ్రాంతి తీసుకున్న మెదడులో రసాయనాలు నిండి మీ ఏకాగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది . ఇది ఏదైనా పనిని తక్కువ సమయంలో చేసేదిగా చూస్తుంది.
5. సృజనాత్మక క్రియలు - కథలు, కవితలు, పాటలు అలాగే ఆటలు ఆడేందుకు ఇది అనువైన సమయం.
6. అలాగే పొద్దున్న పక్షుల కిలకిలలు, మంచు, సూర్యోదయం, చల్లదనం మొదలైనవి మానసిక ప్రశాంతతని చేకూర్చి రోజుని ఓక మంచి అనుభూతితో మొదలు పెట్టవచ్చు.