పిల్లలకు ఏదైనా అయితే తన బాధను వర్ణించలేనిది. ఇలాంటి సంఘటన కేరళ లో ని తిరువళ్లూరు సమీపంలో జరిగింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అమ్మ ప్రేమ ఎంత మధురం ..ఏం పెట్టినా ..ఏం చేసినా ..నూటికి నూరు సార్లు ఆలోచించి మరీ చేస్తుంది. కాని చిన్న చిన్న తప్పులు చేసినా అవి పిల్లలకు నష్టం కలిగించాలని మాత్రం చెయ్యదు. పొరపాటున తన తప్పు వల్ల పిల్లలకు ఏదైనా అయితే తన బాధను వర్ణించలేనిది. ఇలాంటి సంఘటన కేరళ లో ని తిరువళ్లూరు సమీపంలో జరిగింది.
3 ఏళ్ల చిన్నారి బిస్కెట్ తింటూ ఊపిరి ఆడక చనిపోయింది. కందిగై గ్రామంలో అరికృష్ణన్, అమ్ములు దంపతులకు వెంకట లక్ష్మి అనే 3 సంవత్సరాల వయసు గల కుమార్తె ఉంది. చిన్నారికి బిస్కెట్ ను టీ లో ముంచి తినిపించారు. ఆటైంలో బిస్కెట్ తన గొంతుకు అడ్డంగా ఇరుక్కొని ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. పాపను సెంగున్రం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మరణించినట్లు వైద్యులు గుర్తించారు.చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లువర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పిల్లలకు దాదాపు 7,8 యేళ్లు వచ్చే వరకు సరైన పోషకాహారాన్ని ఇవ్వాలని తెలిపారు డాక్టర్లు. బిస్కెట్లు చాలా వరకు అవాయిడ్ చెయ్యాలని కోరారు. మైదా ప్రాడెక్ట్స్ పిల్లలు తినడం వల్ల పిల్లలకు చిన్న వయసులోనే ..ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయని తెలిపారు.