నటి, యాంకర్ అనసూయ వచ్చిందని ఏకంగా ఆర్టీసీ బస్టాండ్ నే మూసేసారు. అనసూయ ఓ పక్క సినిమాలు, షోలతో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు షాప్ ఓపెనింగ్స్ కూడా చేస్తుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సాధారణంగా సెలబ్రెటీస్ ఎక్కడికైనా వెళ్తే ఎంతో కొంత సెక్యూరిటీ చాలా కామన్. ఫ్యాన్స్ నుంచి తమను కాపాడడానికి బౌన్సర్స్ ఇవన్నీ చాలా కామన్ . కొన్ని ప్లేసుల్లో ట్రాఫిక్ కోసం ఆటోలు అవీ ఆపుతుంటారు. కాని కొంచెంసేపు మాత్రమే. అయితే నటి, యాంకర్ అనసూయ వచ్చిందని ఏకంగా ఆర్టీసీ బస్టాండ్ నే మూసేసారు. అనసూయ ఓ పక్క సినిమాలు, షోలతో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు షాప్ ఓపెనింగ్స్ కూడా చేస్తుంది.
కడప జిల్లా మైదుకూరులోని ఓ బట్టల షాప్ ఓపెనింగ్ కి వెళ్ళింది. అయితే ఆ బట్టల షాప్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉంది. దీంతో అనసూయ వస్తుందని, జనాలు భారీగా వస్తున్నారని అధికారులు ఏకంగా ఆర్టీసీ బస్టాండ్ నే మూసేసారు. దీని వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడడంతో పాటు ఆటోలు ఆశ్రయించారు.
అనసూయ వస్తే ఏంటి, వచ్చి షాప్ ఓపెనింగ్ చేసుకుంటే ఏంటి? ఆమె వస్తుందని ఏకంగా బస్టాండ్ ని మూసేయడం ఏంటి అని అక్కడి ప్రయాణికులు మీడియాతో మాట్లాడుతూ విమర్శలు చేసారు. అయితే ఈ విషయంలో అనసూయ తప్పేమి లేదని, అసలు ఆమెకు ఈ విషయం కూడా తెలీదని, అధికారులే ఇలా చేశారని ఈవెంట్ నిర్వాహకులు చెప్పినట్టు సమాచారం. కాని అనసూయపై మాత్రం సోషల్ మీడియా లో ఫుల్ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది.