లేడి పిల్లల గెంతులు వేస్తూ, చలాకీగా ఉండే హీరోయిన్ అంటే తెలుగు ప్రేక్షకులకు టక్కున గుర్తుకు వచ్చేది సాయి పల్లవి మాత్రమే. తన నటన తీరయినా సరే, డాన్స్ చేసినా సరే ఏదైనా సరే అద్భుతంగా రక్తి
న్యూస్ లైన్ డెస్క్: లేడి పిల్లల గెంతులు వేస్తూ, చలాకీగా ఉండే హీరోయిన్ అంటే తెలుగు ప్రేక్షకులకు టక్కున గుర్తుకు వచ్చేది సాయి పల్లవి మాత్రమే. తన నటన తీరయినా సరే, డాన్స్ చేసినా సరే ఏదైనా సరే అద్భుతంగా రక్తి కట్టిస్తుంది. అలాంటి సాయిపల్లవి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్పోజింగ్ ఉన్న పాత్రలు మాత్రం చేయలేదు. కేవలం దమ్మున్న కథలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్న సాయిపల్లవి ఇంట్లో తాజాగా శుభకార్యం జరిగింది. తన చెల్లి పూజా కన్నన్ వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మరి ఆ పెళ్లి ఎవరితో జరిగింది ఆ వివరాలు ఏంటో చూద్దాం..
సాయి పల్లవి సోదరి పూజ కన్నన్ కూడా ఒక నటి. అయితే ఈమెకు తన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి వినీత్ తో అంగరంగ వైభవంగా ఈరోజు పెళ్లి జరిగింది. ఈ పెళ్లిలో సాయిపల్లవి మామూలు హంగామా చేయలేదు. తన సోదరితో కలిసి సాంప్రదాయ దుస్తులు ధరించి స్టేజిపై ఆడి పాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇవి చూసిన నెటిజెన్స్ వారికి శుభాకాంక్షలు చెబుతూనే సాయిపల్లవి డాన్స్ చూసి ఫిదా అయిపోతున్నారు. లేడి పిల్లల అద్భుతంగా డాన్స్ చేస్తున్న నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే సాయిపల్లవి సోదరి కోలీవుడ్ మూవీ "చితిరై సెవ్వానం" అనే చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ అందరి ఆదరణ పొందింది. అలాంటి ఈమె గత కొంతకాలం నుంచి వినీత్ అనే వ్యక్తితో ప్రేమలో పడి చివరికి ఇరు కుటుంబాలను ఒప్పించి జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ తాజాగా పెళ్లి ద్వారా ఒక్కటైపోయారు.
https://twitter.com/i/status/1831393025164996975