నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అంటే ఎవరికైనా సరే తన సహజ నటననే గుర్తుకువస్తుంది. మేకప్ వేసుకోకుండా, ఎక్స్పోజింగ్ చేసే పాత్రల్లో నటించకున్నా కూడా కేవలం తన హావభావాలతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక సాయి పల్లవి దాదాపు పది సంవత్సరాలుగా ఓ వ్యక్తితో సీక్రెట్ లవ్వాయణం నడిపిస్తున్నట్టు తెలుస్తుంది.మరి ఇంతకీ సాయి పల్లవి మెచ్చింది ఎవరినో తెలిస్తే మీరందరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే సాయి పల్లవి మెచ్చిన వ్యక్తి ఎవరో కాదు మహాభారతంలోని అర్జునుడి కొడుకు అభిమన్యుడు.. అవును మీరు వినేది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా సాయి పల్లవి తాజా ఇంటర్వ్యూలో చెబుతూ నేను దాదాపు పది సంవత్సరాలుగా అభిమన్యుని ప్రేమిస్తున్నాను అంటూ చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.అంతేకాదు అభిమన్యుడు నా డ్రీమ్ బాయ్ అంటూ సాయి పల్లవి మాట్లాడే వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
న్యూస్ లైన్ డెస్క్: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అంటే ఎవరికైనా సరే తన సహజ నటననే గుర్తుకువస్తుంది. మేకప్ వేసుకోకుండా,ఎక్స్పోజింగ్ చేసే పాత్రల్లో నటించకున్నా కూడా కేవలం తన హావభావాలతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అనుకోకుండా సినిమాల్లో అవకాశం వచ్చిన సాయి పల్లవికి ఇండస్ట్రీ బ్రహ్మరథం పట్టిందని చెప్పుకోవచ్చు. మలయాళం లో వచ్చిన ప్రేమమ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో హీరోయిన్ గా చేసింది.
ఇక మొదటి సినిమానే హిట్టవ్వడంతో సాయి పల్లవి నటనకి చాలామంది అభిమానులు అయిపోయారు. మరీ ముఖ్యంగా తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ తన కట్టుబొట్టు చూసి అందరూ సాయి పల్లవి ని ఇష్టపడ్డారు. ఇప్పటికి కూడా చాలామంది సామాన్య జనాలే కాదు సెలబ్రిటీలకు కూడా సాయి పల్లవి ఫేవరెట్ హీరోయిన్. ఒకప్పుడు ఇండస్ట్రీలో సావిత్రి,సౌందర్య వంటి హీరోయిన్లు ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే తమ నటనతోనే స్టార్ స్టేటస్ తెచ్చుకున్నారు. ఇక అలాంటి వారిలో ఇప్పటి జనరేషన్లో ఎవరైనా ఉన్నారు అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది సాయి పల్లవి మాత్రమే.హాట్ సన్నివేశాల్లో నటిస్తేనే అవకాశం ఇస్తా అనే ఈరోజుల్లో ఎలాంటి గ్లామర్ పాత్రల్లో నటించకుండా,ముద్దు సన్నివేశాలలో చేయకున్నా కూడా సాయి పల్లవిని హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఎంతో మంది దర్శకులు వెయిట్ చేస్తూ ఉంటారు.
ఇక సాయి పల్లవి ఆ సినిమాలో నటిస్తుంది అంటే చాలు ఆ సినిమాలో హీరో ఎవరు అని కూడా ఆలోచించకుండానే సినిమా థియేటర్ కి వెళ్తారు. అయితే అంత మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి దాదాపు పది సంవత్సరాలుగా ఓ వ్యక్తితో సీక్రెట్ లవ్వాయణం నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా సాయిపల్లవి తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ విషయం కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.మరి ఇంతకీ సాయి పల్లవి 10 సంవత్సరాలుగా సీక్రెట్ గా లవ్ మెయింటైన్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? సాయి పల్లవికి నచ్చిన ఆ అదృష్టవంతుడు ఎవరు అని చాలామంది ఆసక్తిగా ఈ వార్త చూస్తూ ఉంటారు. మరి ఇంతకీ సాయి పల్లవి మెచ్చింది ఎవరినో తెలిస్తే మీరందరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే సాయి పల్లవి మెచ్చిన వ్యక్తి ఎవరో కాదు మహాభారతంలోని అర్జునుడి కొడుకు అభిమన్యుడు..
అవును మీరు వినేది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా సాయి పల్లవి తాజా ఇంటర్వ్యూలో చెబుతూ నేను దాదాపు పది సంవత్సరాలుగా అభిమన్యుని ప్రేమిస్తున్నాను అంటూ చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు అభిమన్యుడు నా డ్రీమ్ బాయ్ అంటూ సాయి పల్లవి మాట్లాడే వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె తెలుగులో చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ మూవీలో హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా చేస్తున్నారు. అలాగే బాలీవుడ్లో రామాయణ్ మూవీలో కూడా సీత పాత్రలో నటిస్తుంది.