దేశంలో పనిచేస్తున్న అందరి ఐఏఎస్ ల కంటే ఆయనే ధనవంతుడు. దాదాపు 8.9 కోట్ల ఆస్తి ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా...సివిల్ సర్వెంట్ గా నెలకు రూపాయి జీతం తీసుకునే వ్యక్తి. ఇది చాలా మందికి ఆశ్చర్యం గా అనిపించినా ..ఇదే నిజం జనాలకు సాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో సివిల్ సర్వీస్ ఉద్యోగం చేస్తున్నారు. కాని దేశంలో పనిచేస్తున్న అందరి ఐఏఎస్ ల కంటే ఆయనే ధనవంతుడు. దాదాపు 8.9 కోట్ల ఆస్తి ఉంది.
హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన అమిత్ కటారియా 2004 చత్తీస్‌గఢ్ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఎలాంటి రిమార్క్ లేకుండా ..ఐఏఎస్ గా ఉన్న అత్యంత నిజాయితీపరుడై ఐఏఎస్ గా పేరు పొందారు.ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న కటారియా ప్రతిష్ఠాత్మక ఐఐటీలో చదువు పూర్తిచేశారు. 2003లో జరిగిన యూపీఎస్‌సీ పరీక్షల్లో 18వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారి అయ్యారు.
ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే రూపాయి వేతనం తీసుకోవాలని అమిత్ నిర్ణయించుకున్నారు. తను ఐఏఎస్ అవ్వాలనుకున్నది ..ప్రజలకు సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో రూపాయి జీతం తీసుకుంటున్నారు. అత్యంత ధనవంతుడైన ఐఏఎస్ అధికారిగా పేరు పొందిన అమిత్ ఏడేళ్లపాటు కేంద్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లి ఇటీవలే తిరిగి రాష్ట్రానికి వచ్చారు. ఆయన భార్య అస్మిత హండా కమర్షియల్ పైలట్. అంతేకాదు వీరికి ఫ్యామిలీ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. దీని వల్లే ఆయన అన్ని ఆస్తులు సంపాదించారని తెలిపారు. ఐఎస్ అధికారుల్లో ఇయన అత్యంత ధనవంతుడిగా పేరుపొందారు.