వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ప్రస్థానం, రొటీన్ లవ్ స్టోరీ, జోరు, బీరువా, రారా కృష్ణయ్య వంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు సందీప్ కిషన్. ఈయన సినిమాలే కాదు రెస్టారెంట్ బిజినెస్ లో కూడా దూసుకుపోతున్నారు. అలా పలు బిజినెస్ లు చేస్తూనే సినిమాల్లో హీరోగా నిలదొక్కుకున్నారు. అయితే అలాంటి సందీప్ కిషన్ నటించిన చివరి చిత్రం ఊరు పేరు బైరవకోన.ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఒకే టాక్ తెచ్చుకుంది.
న్యూస్ లైన్ డెస్క్: వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ప్రస్థానం, రొటీన్ లవ్ స్టోరీ, జోరు, బీరువా, రారా కృష్ణయ్య వంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు సందీప్ కిషన్. ఈయన సినిమాలే కాదు రెస్టారెంట్ బిజినెస్ లో కూడా దూసుకుపోతున్నారు. అలా పలు బిజినెస్ లు చేస్తూనే సినిమాల్లో హీరోగా నిలదొక్కుకున్నారు. అయితే అలాంటి సందీప్ కిషన్ నటించిన చివరి చిత్రం ఊరు పేరు బైరవకోన.ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఒకే టాక్ తెచ్చుకుంది.
ఇక ప్రస్తుతం సందీప్ కిషన్ కోలీవుడ్ హీరో ధనుష్ రాయన్ మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాలో తన పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అంటూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొస్తున్నారు. ఇక ఈ మూవీ జూలై 26న విడుదలకు సిద్ధంగా ఉండడంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచారు.అలా ఓ ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నాకు సైనస్,బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది.అందుకే డస్ట్ పడదు. నేను ఓ సినిమా షూటింగ్ సమయంలో డస్ట్ ఎక్కువ ఉన్న సీన్లో చేశాను.
కానీ ఆ టైంలో ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడ్డాను. దాంతో నన్ను గమనించిన వాళ్లు అంబులెన్స్ కి ఫోన్ చేస్తా అని చెప్పారు.కానీ వెంటనే నేను ఓ పదినిమిషాలు నాకు రెస్ట్ ఇవ్వండి అని చెప్పాను. అలా నన్ను ఓ 10 నిమిషాలు ఒక ప్రశాంతమైన ప్లేస్ లో వదిలేసి అందరూ పక్కకు తప్పుకున్నారు.ఇక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ నార్మల్ అయిపోయాను.ఆ తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొన్నాను.అలా డస్ట్ నాకు అస్సలు పడదు. ఇక ఈ మూవీ షూటింగ్లో చాలానే దెబ్బలు తగిలాయి అంటూ తనకి ఉన్న హెల్త్ ప్రాబ్లం తో పాటు రాయన్ సినిమా గురించి కూడా చెప్పుకొచ్చారు సందీప్ కిషన్