MOVIE REVIEW: ‘సారంగదరియా’ రివ్యూ

సారంగదరియా...చిన్న సినిమా ..బాక్సాఫీస్ బరిలో ఏదైనా పెద్ద సినిమా ఉందంటే.. చిన్న సినిమాలు సైడైపోతుంటాయి.  పెద్ద సినిమాలతో పోటీపడలేక కొన్ని పక్కకి పోతున్నాయి. కమల్ హాసన్, శంకర్ కాంబోలో భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’ రిలీజ్‌ అవుతున్నా.. ధైర్యం చేసి నేడు థియేటర్స్‌లో విడుదలైన చిన్న చిత్రం ‘సారంగదరియా’.


Published Jul 12, 2024 08:41:00 PM
postImages/2024-07-12/1720797192_Sarangadariyaisaninspirationalsong.jpeg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  సారంగదరియా...చిన్న సినిమా ..బాక్సాఫీస్ బరిలో ఏదైనా పెద్ద సినిమా ఉందంటే.. చిన్న సినిమాలు సైడైపోతుంటాయి.  పెద్ద సినిమాలతో పోటీపడలేక కొన్ని పక్కకి పోతున్నాయి. కమల్ హాసన్, శంకర్ కాంబోలో భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’ రిలీజ్‌ అవుతున్నా.. ధైర్యం చేసి నేడు థియేటర్స్‌లో విడుదలైన చిన్న చిత్రం ‘సారంగదరియా’.


ఒక్క.. రాజా రవీంద్ర మినహా యశస్విని, మొయిన్ మహమ్మద్, మోహిత్ పేడాడ‌, నీల ప్రియా, శివ చందు ఇలా మిగిలిన వాళ్లంతా కొత్త మొహాలే. ఇది కూడా సినిమా కు కాస్త నెగిటివ్ అయ్యింది. సినిమా బాగుందేమో అనుకునే లోపే...చిన్న బడ్జెట్ ..చిన్న సినిమా అని తెలిసిపోతుంది.


ఇది మధ్యతరగతి కుటుంబానికి చెందిన మన కథలా అనిపిస్తుంది. ఇంటింటికి ఓ రామాయణం. ఓ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ అయిన కృష్ణకుమార్ (రాజా రవీంద్ర).. స్టూడెంట్స్‌కి లెక్చర్లు ఇస్తుంటాడు...కాని తన కొడుకుల్ని మాత్రం పట్టించుకోడు. ఓ కొడుకు తాగుబోతు.. ఇంకో కొడుకు తిరుగుబోతు. మిగిలిన కూతురు వల్ల సమాజంలో ఇంక తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. వీటిని రాజా రవీంధ్ర ఎలా హ్యాండిల్ చేశాడు ఇదే సినిమా ..


సమాజంలో అమ్మాయిగా చెప్పుకోవడానికే వెనుకాడే ఓ ట్రాన్స్ జెండర్.. సమాజానికి ఎదురెళ్లి మోడల్‌గా రాణించే ఇన్‌స్పిరేషన్‌ స్టోరీ. లోపమున్నా...తల్లితండ్రులు సాయం చేస్తే ఎంత ఎత్తుకు ఎదగగలరనేది ఈ కథలో చూపించాడు దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా.. ప్రేమ అనేది కుల మతాలకు అతీతం అనేట్టుగా చూపించారు. ట్రాన్స్ జండర్స్ కూడా మనుషులే అనే విషయాన్ని గట్టిగా చెప్పాలనుకున్నారు. కృష్ణ కుమార్ పాత్ర.. రాజా రవీంద్రకి బాగా సెట్ అయ్యింది. కుటుంబ భారాన్ని భుజాలపై మోసే బరువైన పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా టాన్స్ జెండర్ అయిన కూతురుకి రాజా రవీంధ్ర ఎలా సాయం చేశాడో చాలా బాగా చూపించారు.


ఈ సినిమాకి కీ రోల్ అంటే.. ట్రాన్స్ జెండర్‌ అనుగా చేసిన యశస్విని . ఈ రోల్‌ని చాలా ఛాలెంజింగ్‌గా చేసింది యశస్విని. అసలు అబ్బాయిలో అమ్మాయి లక్షణాలు...ఇంట్లో ఎలా చెప్పాలో తెలీక తను పడే ఆవేదన సినిమాల్లో చాలా బాగా చూపించారు.ఇక అర్జున్ పాత్రలో మోయిన్‌ మొహమద్‌ తాగుబోతుగా జీవించేశాడు. అతను చెప్పే డైలాగ్‌లు కులపిచ్చోళ్లకి గట్టిగానే తగులుతాయి. 


కృష్ణ కుమార్ రెండో కొడుకుగా మొహిత్ కామిడీ బాగా పండించాడు. ముస్లిం అమ్మాయి ని దక్కించుకోవడానికి సున్తీ చేయించుకొని బట్టలేకుండా అమ్మాయి ఫాధర్ ముందు నిల్చుంటాడు. ఈ సీన్ కు మాత్రం థియేటర్ లో నవ్వులు దద్దిరిపోయాయి. స్టోరీ బాగున్నా ..బడ్జెట్ లేదని మాత్రం క్లియర్ గా తెలసిిపోతుంది. ఏదో ఉన్నంతలో తీశారు. మరీ తీసి పారేసేలా కాకుండా చూడొచ్చు. అధ్భుతం అని కాదు కాని ఓకే ఓకే సినిమా . సినిమా కు రేటింగ్ 2 ** ఇవ్వొచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu release movie-news

Related Articles