కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు తట్టి లేపితే కానీ, సర్కార్ మొద్దు నిద్ర వీడడంలేదని పలువురు అంటున్నారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే తప్ప పనులు జరగడం లేదు. మిడ్ మానేరు ప్రాజెక్టుకు ఎత్తిపోతలను ప్రారంభించాలని ఇటీవల మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వానికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ సవాల్‌కు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. కాళేశ్వరం పంపులను స్టార్ట్ చేసింది.
ఇక, గత వారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు. సిద్దిపేటలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మ, అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌లో నీళ్లులేక అడుగంటిపోయే పరిస్థితికి వచ్చాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని.. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయిందని ఆయన వెల్లడించారు.
కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే, హరీష్ రావు రాసిన లేఖపై సర్కార్ స్పందించినట్లు తెలుస్తోంది. సిద్ధిపేట జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. హరీష్ రావు రాసిన లేఖ అందిందని నీటి పారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు.