ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అధికారుల పాలన నడుస్తోంది. ఇంకా రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని అనేక వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో గ్రామాల్లో, మండలాల్లో పోటీ
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అధికారుల పాలన నడుస్తోంది. ఇంకా రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని అనేక వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో గ్రామాల్లో, మండలాల్లో పోటీ చేసే అభ్యర్థులు సన్నద్ధమైపోతున్నారు. అన్ని పార్టీల నుంచి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అప్పుడే నామినేషన్ వేసి ఎన్నికల బరిలోకి వెళ్తారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సర్పంచ్ పదవి. ప్రతి గ్రామానికి బాస్ అంటే సర్పంచ్.
ఈ పదవి కోసం ప్రతి గ్రామం నుంచి అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు పోటీలో ఉంటారు. అలాంటి సర్పంచ్ ఎన్నికల రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. అలాంటి సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే అక్కడ సర్పంచ్ ను ఏకగ్రీవం చేసేసుకున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. చెరువు కొమ్ము తండాలో షెడ్యూల్ కు ముందే సర్పంచ్ ఏకగ్రీవం అయిపోయాడు. తండా వాసులంతా ఏకమై సర్పంచ్ ను ఏకగ్రీవం చేస్తూ కాగితం కూడా రాసిచ్చారట.
అయితే ఆ ఊరిలో సర్పంచ్ గా బరిలో ఉండాలనుకున్నటువంటి అభ్యర్థి ధరావత్ బాలాజీ తండాలో మూడు గుళ్ళు కట్టిస్తానని, అంతేకాకుండా బొడ్రాయి పండుగను కూడా ఘనంగా జరిపిస్తానని ఇంటికి వెయ్యి రూపాయలు పంచుతానని ముందే ప్రతిపాదించాడట. దీంతో ఆ గ్రామస్తులంతా కలిసి ధరావత్ బాలాజీని సర్పంచ్ గా ఏకగ్రీవం చేస్తూ ఒక ఒప్పంద కాగితం రాసి ఇచ్చారు. గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఎవరు పోటీ చేయవద్దని బాలాజీ ఒక్కరే పోటీలో ఉంటారని అందరూ సంతకం చేసి ఒప్పంద పత్రం చేసుకున్నారు. దీంతో ఎన్నికలు కాకముందే బాలాజీ ఏకగ్రీవంగా సర్పంచ్ అయినట్టు విజయోత్సవ ర్యాలీ కూడా నిర్వహించారు.