బ్యాంకు పనులు కంపల్సరీ శుక్రవారం లోపు తీర్చుకుంటే బెటర్ లేదంటే మళ్లీ మంగళవారం వరకు ఆగాల్సిందే.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ వారంతంలో బ్యాంకులు లైన్ గా మూడు రోజులు సెలవులున్నాయి. బ్యాంకు పనులు ఉండి వాయిదా వేస్తున్న వారు ..వెంటనే శుక్రవారం లోపు పని చేసేసుకుంటే బెటర్. ఎంత ఆన్ లైన్ పేమెంట్లు చేసినా ..బ్యాంకులతో పనులు కూడా ఉంటాయి కదా...బ్యాంకు పనులు కంపల్సరీ శుక్రవారం లోపు తీర్చుకుంటే బెటర్ లేదంటే మళ్లీ మంగళవారం వరకు ఆగాల్సిందే.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల వద్ద రద్దీ మరీ ఎక్కువగా వుంటుంది. గ్రామీణ ప్రజలు ఆన్ లైన్ పేమెంట్స్ పై పెద్దగా అవగాహన లేకపోవడంతో నేరుగా బ్యాంకుల ద్వారానే జరుపుతుంటారు. అలాగే మహిళా సంఘాలు, ఉపాధి కూలీలు కూడా గ్రామీణ బ్యాంకుల వద్దకే వస్తుంటారు. కాబట్టి రద్దీ ఎక్కువగా వుంటుంది. అయితే ఇలాంటి వారికి ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ వారం ..మూడు రోజులు లైన్ గా బ్యాంకులకు సెలవులు. రెండవ శనివారం , ఆదివారం, సోమవారం ఈద్ మిలాద్ మూడు రోజులు సెలవులు. కాబట్టి బ్యాంకింగ్ లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది.
ఇక సెప్టెంబర్ 17న వినాయక నిమజ్జనం. మాగ్జిమమం ఆరోజు కూడా బ్యాంకులు వెళ్లే 11వ రోజు నిమజ్జనం చేస్తే 17 కూడా మీరు బిజీగా నే ఉంటారు. బ్యాంకుకు వెళ్లే అవకాశం ఉండదు. అంటే ఈ వారంలో మీ బ్యాంక్ పని కాలేదంటే మళ్లీ సెప్టెంబర్ 18నే చేసుకోవాలి. సో అత్యవసర బ్యాంకు పనులు ఉంటే ఇప్పుడే చేసేసుకొండి.