తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లు అంటే కట్టుబొట్టు, తెలుగింటి ఆడపిల్లల ఉండేవారు. వాళ్ళ యాక్టింగ్ తో మాత్రమే అదరగొట్టేవారు. అలాంటి టైంలో కాస్త శృంగా*ర పాత్రలు అంటే షకీలా, సిల్క్ స్మిత వంటి హీరోయిన్లు
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లు అంటే కట్టుబొట్టు, తెలుగింటి ఆడపిల్లల ఉండేవారు. వాళ్ళ యాక్టింగ్ తో మాత్రమే అదరగొట్టేవారు. అలాంటి టైంలో కాస్త శృంగా*ర పాత్రలు అంటే షకీలా, సిల్క్ స్మిత వంటి హీరోయిన్లు ఉండేవారు. ఆ ఇద్దరు హీరోయిన్లు అలాంటి పాత్రలు ప్రతి సినిమాలో చేసేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ప్రతి హీరోయిన్ ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా వెనకాడడం లేదు.
ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఐటమ్ సాంగ్స్, బోల్డ్ సీన్స్ లో నటిస్తున్నారు. కానీ అప్పట్లో ఈ పాత్రలు అంటే తప్పనిసరిగా చాలామందికి గుర్తుకు వచ్చేది షకీలా మాత్రమే. షకీలా పాత్ర సినిమాలో ఉందంటే థియేటర్లలోకి పరుగులు తీసేవారు జనాలు. అలాంటి షకీలా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ వల్ల అనేక ఇబ్బందులు పడిందట. ఆ దర్శకుడు డైరెక్ట్ గా తనను రూమ్ లోకి రమ్మన్నారని షకీలా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.ఆ డైరెక్టర్ ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. షకీలా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ నటి. ఈమె డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు వెయిట్ చేసేవారు.
ఎన్నో చిత్రాల్లో నటించిన షకీలా తనకు వచ్చిన డబ్బునంతా తన కుటుంబ సభ్యులకు ఇచ్చి చివరికి వారి చేతిలోనే మోసపోయనని, అంతేకాదు ఎంతో మంది దర్శకుల చేతిలో కూడా చితికిపోయానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో తండ్రి ఓసారి పిలిచాడని కామెంట్ చేసింది. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే అల్లరి నరేష్. ఈయన పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయన తండ్రి ఇవివి సత్యనారాయణ.
ఈయన ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఉండేవారు. అయితే సత్యనారాయణ ఒకప్పుడు నాకు సినిమా ఆఫర్ ఇస్తానని, నాతో రూమ్ లో గడపాలని టార్చర్ చేశాడు. కానీ ఆయన ఆఫర్ ను నేను సున్నితంగా తిరస్కరించి బయటపడ్డాను. ఆ తర్వాత ఆయన ఎన్నిసార్లు పిలిచినా ఆయన చిత్రాల్లో అస్సలు ఏ పాత్ర కూడా చేయలేదని షకీలా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.