అయితే ఆయన మొదట ఇంజనీర్ అవ్వాలని వాళ్ల తాతగారు తీర్మానించారట. కాని తనకు ఇంజనీర్ అవ్వాలని లేదని హీరోఅవుతానని చెప్పారట శోభన్ బాబు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు గ్లామర్ కోసం మాట్లాడుకుంటున్నాం..కాని అప్పట్లో 70,80ల్లో గ్లామర్ అంటే శోభన్ బాబు ..ఇండస్ట్రీ లో హ్యాండ్ సమ్ ఎవరంటే శోభన్ బాబు పేరే వచ్చేదట. అంత అందగాడు . “సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. శోభన్ బాబు గురించి ప్రతి సంధర్భంలోను ఏదో ఒక కొత్త మాట వింటూనే ఉంటాం. అయితే ఆయన మొదట ఇంజనీర్ అవ్వాలని వాళ్ల తాతగారు తీర్మానించారట. కాని తనకు ఇంజనీర్ అవ్వాలని లేదని హీరోఅవుతానని చెప్పారట శోభన్ బాబు.
ఆయన ఇంట్లో హీరో అవుతా అని చెప్పే టైంకి పెళ్లి కూడా అయ్యింది. శోభన్ బాబుకి సినిమాలంటే పిచ్చి ..కాని పెళ్లి కుటుంబం వల్ల ఇంజనీరింగ్ చెయ్యమని పెద్దలు చెప్పారట. అది కూడా అలిఘడ్ యూనివర్సిటీలో చదవడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేసేశారు. అయితే శోభన్ బాబు మాత్రం ఇంజనీరింగ్ చదవాలా లేక మద్రాసులో లా కోర్సులో చేరాలా అనే డైలామాలో పడ్డారు. మద్రాసులో అయితే సినిమా ప్రయత్నాలు కూడా చేయవచ్చన్న ఆలోచనతో మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చి అదే విషయాన్ని ఆయన నాన్నగారితో చెప్పారు.
వారు సరేనన్నారు. మద్రాసులో సినిమాల్లో ప్రయత్నం చేయబోతున్నామని స్నేహితులతో చెప్పగా వారిలో కొంతమంది హీరో లక్షణాలున్నాయి. ప్రయత్నం చెయ్ అంటూ ప్రోత్సాహం ఇచ్చారు. మరికొందరు మాత్రం చదువు పాడుచేసుకోకు. శోభన్ బాబు చాలా బాగా చదివేవారట. కెరియర్ ను చక్కగా ప్లాన్ చేసుకో ...ఎందుకు మనకీ సినిమాలు అంటు మరికొందరు చెప్పారట. ఈ భయమే ..శోభన్ బాబు ఆర్ధికంగా మంచి ప్రణాళికలు వేయడానికి ఉపయోగపడిందని కూడా అంటుంటారు.
లా కోర్స్ నెపంతో మద్రాసులో అడుగుపెట్టాలన్నదే శోభన్ బాబు ఆలోచన తప్ప లాయర్ అయిపోవాలన్నది ఆయన ఆశయం కాదు. పొరపాటున అబద్ధం చెబితేనే లోలోపల కుంగిపోయే శోభన్ బాబు అబద్ధాలనే వృత్తిగా స్వీకరించలేనని తాతగారితో చెప్పారట. అయితే వారి తాత గారు మాత్రం తెరపై కనిపిస్తే హీరోగానే కనిపించాలి...కామిడీ వేషాలు...చిన్న చితకా వేషాలు వేసి తన కుటుంబ పరువు తియ్యనని మాటఇచ్చారట. అలా హీరో అయ్యి ఆంధ్రా అందగాడయ్యాడు శోభన్ బాబు.