9ఏళ్ల తర్వాత లారెన్స్ కు  చిరు పిలుపు..విషయం ఏంటంటే.?

Published 2024-07-03 22:39:12

postImages/2024-07-03/1720026552_raghava.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్, ఏఎన్ఆర్,  సూపర్ స్టార్, కృష్ణ, వంటి వారు మాత్రమే.  అని వీరి తరం తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు, గుర్తుకొస్తారు.  కానీ వీరి తర్వాత ఎంతోమంది హీరోలు వచ్చారు. కానీ వీరి తరం హీరోలందరికీ డాన్స్ మాస్టర్ అంటే రాఘవ లారెన్స్ మాత్రమే ఉండేవారు. ఆయన స్టెప్ అందిస్తే చాలు ఏ హీరో కైనా చాలా బాగా నచ్చేది. అలాంటి రాఘవ లారెన్స్ వేయించిన స్టెప్పుల ద్వారానే చిరంజీవి చాలా ఫేమస్ అయ్యారు.  అప్పట్లో చిరంజీవి డ్యాన్స్ కు చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. ఆ విధంగా రాఘవ లారెన్స్ అంటే చిరంజీవికి కూడా చాలా ఇష్టం ఉండేది.  

రాఘవ లారెన్స్  ఒకప్పుడు ఫేమస్ డాన్స్ మాస్టర్ గా ఉన్న ఈయన ప్రస్తుతం దర్శకుడుగా మారి బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు డైరెక్టర్ గా కూడా బిజీ అయిపోయారు.  అలాంటి రాఘవ లారెన్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి డాన్స్ మాస్టర్ గా చేయడం మానేశారు. డాన్స్ మాస్టర్ గా  సైలెంట్ గా ఉన్నా కానీ, ఆయన గతంలో కంపోజ్ చేసిన సాంగ్స్ వల్ల ఎంతో మంది హీరోలు మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ హీరోలు ఇప్పటికీ ఆయనను మర్చిపోవడం లేదు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చిరంజీవి అని చెప్పవచ్చు.

అయితే చిరంజీవి నటించినటువంటి ముఠామేస్త్రిలో సైడ్ డాన్సర్ గా చేసినటువంటి లారెన్స్,  హిట్లర్ రూపంలో పూర్తిస్థాయి డ్యాన్స్ మాస్టర్ గా మారారు. అయితే చిరంజీవి నమ్మి తనకు డాన్స్ మాస్టర్ గా ఆఫర్ ఇవ్వడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. రాఘవ లారెన్స్ కూడా నేను చిరంజీవి వల్ల ఇంత స్థాయికి వచ్చానని చెబుతూ ఉంటారు. అలాంటి చిరంజీవి మరియు రాఘవ లారెన్స్ కాంబో మరోసారి రిపీట్ అవుతుందని తెలుస్తోంది. 9 సంవత్సరాల క్రితం ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు అనే పాటను  చేశాడు. అయితే ఈ చిత్రం తర్వాత వీరి మధ్య మరోసారి కలయిక జరగలేదు.  ఇదే తరుణంలో విశ్వంభరలో ఒక పాట కోసం రాఘవ లారెన్స్ ను స్పెషల్ గా  చిరంజీవి తెప్పించుకుంటున్నారని తెలుస్తోంది.  ఈ పాటకు రాఘవ లారెన్స్ అయితేనే పూర్తిస్థాయి న్యాయం చేస్తారని చిరంజీవి భావించారట.ఈ  తరుణంలో రాఘవాకు చిరంజీవి ఫోన్ చేశారని, దానికి రాఘవ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఒకవేళ అన్నీ కలిసి వస్తే మాత్రం రాఘవ లారెన్స్  మెగాస్టార్ చిరంజీవి కాంబోలో మరో హిట్ సాంగ్ బయటకు వస్తున్నట్టే. విశ్వంభరా మూవీ  2025 జనవరి 10న విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.