movies: మోదీతో లవ్ కన్ఫర్మ్ చేసిన హీరోయిన్ 2024-06-28 17:06:57

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రధ్ధాకపూర్( sharaddha kapoor)  ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీ గా ఉంది. చాలా రోజులుగా అమ్మడు లవ్ లో ఉందని తెలుస్తున్నా...ఎవరో మాత్రం గుట్టు విప్పలేదు.బాలీవుడ్ ఫిలిమ్ రైటర్ రాహుల్ మోదీ( rahul modi) తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలకి తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. శ్రద్ధా కపూర్ లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టంది.


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌( prabhas) తో చేసిన ఈ చిత్రంలో శ్రద్ధా అందాలు తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేశాయి. ఫిలిం రైటర్ రాహుల్ మోదీతో ఆమె డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. 


శ్రద్ధా కపూర్ తాజాగా రాహుల్‌తో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌( instagram)  స్టోరీలో పెట్టారు. ఇందులో రాహుల్‌ చేయి పట్టుకొని శ్రద్ధా కనిపించారు. ఇక దీనికి ఓ రొమాంటిక్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. "నా హృదయాన్ని నీ దగ్గరే ఉంచుకో.. కానీ, నా నిద్రను మాత్రం తిరిగిచ్చెయ్" అంటూ స్మైల్ ఎమోజీలతో పాటు హార్ట్‌ సింబల్‌ను పెట్టింది శ్రద్ధా. ఇది ఓ రకంగా లవ్ కన్ఫర్మ్ చెయ్యడమే అంటున్నారు నెటిజన్లు.


గతేడాది రిలీజ్ అయిన 'తు ఝూతి మైన్ మక్కార్' అనే సినిమా సమయంలో శ్రద్ధా కపూర్-రాహుల్ మోదీ మధ్య ప్రేమ చిగురించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి రాహుల్‌ రైటర్‌గా పనిచేశారు. ఇక ఈ చిత్రంలో రణబీర్ కపూర్ హీరోగా నటించారు. ఈ సినిమా తర్వాతి నుంచి శ్రద్ధా-రాహుల్ డేటింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అక్కడ నుంచి ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు..మీడియా కంటపడకుండా డేటింగ్ చేస్తూ ఫైనల్ గా అనౌన్స్ చేసేశారు.