Maheshbabu:నమ్రత మహేష్ బాబులకు సితారా అనుకోకుండా పుట్టిందట.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ ఎవరైనా ఉన్నారు అంటే వారే మహేష్ బాబు నమ్రత దంపతులు. వీరిద్దరికి పెళ్లి జరిగి కొన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటికి కొత్తజంటలానే


Published Aug 18, 2024 05:52:38 AM
postImages/2024-08-18/1723974254_sithara.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో  మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ ఎవరైనా ఉన్నారు అంటే వారే మహేష్ బాబు నమ్రత దంపతులు. వీరిద్దరికి పెళ్లి జరిగి కొన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటికి కొత్తజంటలానే కనిపిస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు అయితే 25 ఏళ్ల యువకుడిలా కనిపిస్తారు. అలాంటి వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మహేష్ బాబుకు కొడుకు గౌతమ్ కూతురు సితార. ప్రస్తుతం సితార అయితే  ఒక స్టార్ హీరోయిన్ కి ఎంత పాపులారిటీ ఉంటుందో అంత పాపులారిటీ సంపాదించుకుంది. ఇలాంటి సితార గురించి  తాజాగా నమ్రత ఒక ఇంటర్వ్యూలో  షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

ఈ సందర్భంగా యాంకర్ మీరు ఏదైనా మంచి ఆఫర్ వస్తే సినిమాల్లో చేస్తారా అని అడిగింది. వెంటనే నమ్రత అది ఎంత పెద్ద ఆఫర్ అయినా సరే ఇక సినిమాల వైపు చూడనని చెప్పుకొచ్చింది. అయితే వీరు పెళ్లి అయిన సమయంలో ఒక కండిషన్ పెట్టారట. నాకు వర్క్ చేసే అమ్మాయి భార్యగా అసలు వద్దు అని చెప్పారట. దీంతో నమ్రత  సినిమాలు  పూర్తిగా మానేసింది.

అయితే వీరు గౌతమ్ పుట్టిన తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి రెండవ సంతానానికి ప్లాన్ చేద్దాం అనుకున్నారట.  కానీ అనుకోకుండానే సితార జన్మించిందని  నమ్రత చెప్పుకొచ్చింది. ఇక సితార పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లల్ని అలనా పాలనా చూసుకుంటూ  నమ్రత హౌస్ వైపుగానే కొనసాగుతూ వస్తోంది. ఇక మహేష్ బాబు అయితే వర్ష సినిమాలు చేస్తూ అద్భుతమైన హిట్స్ దూసుకెళ్తున్నారు. త్వరలో మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో పానండియా చిత్రం కూడా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : news-line mahesh-babu namrata sithara gowtham

Related Articles