కాంగ్రెస్ లో చిల్లర మాటలకే ప్రాధాన్యత..రగిలిపోతున్న ఓ వర్గం..!

రాష్ట్రంలో సోషల్ మీడియా చెలరేగిపోతోంది. ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు. రాజకీయ పార్టీల టీములైతే కన్నూ మిన్నూ కానకుండా రాతలు రాస్తున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. తాజాగా


Published Oct 01, 2024 08:42:00 PM
postImages/2024-10-01/1727795004_konda.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో సోషల్ మీడియా చెలరేగిపోతోంది. ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు. రాజకీయ పార్టీల టీములైతే కన్నూ మిన్నూ కానకుండా రాతలు రాస్తున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. తాజాగా మంత్రి కొండా సురేఖ సైతం ఈ సోషల్ మీడియా రాతలకు బలవ్వాల్సి వచ్చింది. ఆమెను కించపరుస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో మీడియా ముందుకొచ్చిన మంత్రి సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు. మీ ఇంటి ఆడవాళ్లను ట్రోల్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు..నిజంగా ఆడవాళ్ల విషయంలో ఎవరు తప్పుగా వ్యవరించినా ఖండించాల్సిందే. ఇంతవరకు బాగానే ఉంది కానీ... నిత్యం ప్రత్యర్థి పార్టీలోని మహిళలను సైతం కించపరుస్తూ పోస్టులు పెట్టే వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని ఈ అంశంపై మాట్లాడటమే అటు కాంగ్రెస్ పార్టీలో.. ఇటు బయట కూడా చర్చనీయాంశంగా మారింది.

మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మీడియా ఇంచార్జ్ సామరాం మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన వ్యవహారంపైనే ఇంటా బయట చర్చ జరుగుతోంది. హస్తంలో పార్టీలో ఉన్నవాళ్లు కూడా ఇదేం విడ్డూరమని ముక్కున వేలేసుకుంటున్నారు. వేరే పార్టీ మహిళలపై అసభ్య రాతలు.. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు, కామెంట్లు పెట్టే వ్యక్తిని.. పక్కన ఎందుకు కూర్చుబెట్టుకున్నారని కాంగ్రెస్ లోని ఓ వర్గం పరేషాన్ అవుతోందట. మంత్రి విషయంలో జరిగింది నూటికి నూరుపాళ్లు తప్పే.. కానీ అదే తప్పు చేస్తున్న వ్యక్తిని పక్కనపెట్టుకుని.. అదే అంశం గురించి మీడియాతో మాట్లాడటం ఏంటని అంతా కళ్లు తేలేశారట. కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలోనూ కోర్టు తీర్పును తప్పుపట్టేలా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని తెలుస్తోంది.

లిక్కర్ పాలసీ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి బెయిల్ వరకు.. కవితను కించపరిచేలా అనేక పోస్టులు పెట్టారని ఇటు బీఆర్ఎస్ వాళ్లు, అటు హస్తం పార్టీలో ఉన్నకొందరు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ ను ఎవరైనా విమర్శిస్తే.. మహిళలు, పురుషులు అని చూడకుండా ఈయన తనదైన మోటు భాషలో కౌంటర్లు ఇస్తారనే పేరు కూడా ఉంది. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని మంత్రి కొండా సురేఖ మాట్లాడటంపై కాంగ్రెస్ లోని ఓ వర్గం అస్సలు జీర్ణించుకోలేకపోతోందట. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసేవాళ్లకు ప్రాధాన్యత లేదు గానీ.. ఇలా ఇష్టారీతిగా పోస్టులు పెట్టేవాళ్లకు, మహిళలను కించపరిచేవాళ్లకు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారని సమాచారం. మహిళకు అవమానం జరిగితే.. ఆ ప్రెస్ మీట్ లో  సామ రాంమోహన్ రెడ్డి, అనిల్ కుమార్ ను ఎందుకు కూర్చోబెట్టాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. పార్టీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండటంతో.. బహిరంగంగా తమ ఆవేదనను కూడా చెప్పుకోలేకపోతున్నామని కొందరు లీడర్లు చాలా బాధపడుతున్నారు. చిల్లర మల్లర వేషాలు వేసేవాళ్లకే పార్టీలో పెద్దపీట వేస్తున్నారంటూ మదనపడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu congress warangal sama-rammohan-reddy konda-surekha

Related Articles