SNAKE: చెప్పులు ఎత్తుకుపోయిన నాగుపాము ..ఏం చేసుకుంటుందబ్బా

పాములు ఎలుకలు, కప్పలు, తొండలు వంటి ఇతర జీవులను తింటుంటాయి. పాములు వాటికి దొరికన ఎరను, ఆహారంగా తమ నోట కరుచుకొని వెళ్ళిపోతుంటాయి. కాని చాలా రేర్ గా ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి.


Published Sep 15, 2024 05:03:00 PM
postImages/2024-09-15/1726400093_Snakechappal.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పాము అనగానే...కాళ్లు చేతులు షివరింగ్ వచ్చేస్తాయి. కాని పల్లెల్లో ఉండే వారికి  మాత్రం కాస్త తక్కువ భయపడతారు. వాటి కాస్త దగ్గర నుంచి చూస్తూ ఉంటారు కాని చాలా మందికి మాత్రం కాస్త అటు ఇటుగా పాములు అంటే అందరికి ఇదే ఫీలింగ్ ఉంటుంది. పాములు ఎలుకలు, కప్పలు, తొండలు వంటి ఇతర జీవులను తింటుంటాయి. పాములు వాటికి దొరికన ఎరను, ఆహారంగా తమ నోట కరుచుకొని వెళ్ళిపోతుంటాయి. కాని చాలా రేర్ గా ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి.


ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎక్కడ చూసినా పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓ ఇంటి ముందు నాగుపాము వేగంగా రావడం కనిపించింది. పామును చూసి అక్కడ ఉన్న ఆడవాళ్లు భయపడిపోలేదు. నవ్వుతూ ఆ పాముపై జోకులు వేసుకుంటున్నారు. అంతేకాదు ఆ పాము వారిపైకి రాబోతుండగా దగ్గరగా ఉన్నచెప్పును విసురుతుంది. ఆ చెప్పును పాము నోటితో పట్టేస్తుంది.


ఇక ఆ చెప్పును తీసుకొని అంత ఎత్తున పడగ ఎత్తి  సరసరా పారిపోయింది. ఇంతలో ఆ ఆడవాళ్లు నా చెప్పు తీసుకొని వెళ్లిపోతున్నావే. ఓసే నా చెప్పే అంటూ ఏదో ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపే పాము దగ్గర్లో ఉన్న పొలంలోకి వెళ్లిపోయింది. ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.అయితే పాము కోరలు ఆ చెప్పులో ఇరుక్కొని ఉంటాయని అందుకే వదలించుకోలేక చెప్పులు ఎత్తుకుపోతుందని అంటున్నారు నెటిజన్లు. నెటిజన్లు ఈ వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నారు.
 

Related Articles