అప్పట్లో టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు.. మరి ఇప్పుడెవరు.?

90s టాలీవుడ్ అందగాడు ఎవరని అడిగితే చాలామంది టక్కున చెప్పేది హీరో శోభన్ బాబు పేరు మాత్రమే. ఇప్పటికి కూడా ఆయనకు అదే బ్రాండ్ ఉంది. అలా శోభన్ బాబు అప్పట్లో  హీరో పాత్రలు తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అస్సలు చేయలేదు.  ఎన్ని కోట్లు ఇస్తామన్నా ఆయన ఇతర పాత్రలు చేయడానికి ఒప్పుకోలేదట.  దీనికి ప్రధాన కారణం తాను చనిపోయే వరకు అందగాడి గానే, ఒక హీరో గానే చనిపోవాలి తప్ప క్యారెక్టర్ ఆర్టిస్టు చేసి చనిపోకూడదని అనుకున్నారట.  ఆ విధంగా తాను మరణించేవరకు అందగాడిగానే కనిపించారు శోభన్ బాబు.


Published Jul 07, 2024 09:17:36 AM
postImages/2024-07-07/1720355242_mahesh.jpg

న్యూస్ లైన్ డెస్క్: 90s టాలీవుడ్ అందగాడు ఎవరని అడిగితే చాలామంది టక్కున చెప్పేది హీరో శోభన్ బాబు పేరు మాత్రమే. ఇప్పటికి కూడా ఆయనకు అదే బ్రాండ్ ఉంది. అలా శోభన్ బాబు అప్పట్లో  హీరో పాత్రలు తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అస్సలు చేయలేదు.  ఎన్ని కోట్లు ఇస్తామన్నా ఆయన ఇతర పాత్రలు చేయడానికి ఒప్పుకోలేదట.  దీనికి ప్రధాన కారణం తాను చనిపోయే వరకు అందగాడి గానే, ఒక హీరో గానే చనిపోవాలి తప్ప క్యారెక్టర్ ఆర్టిస్టు చేసి చనిపోకూడదని అనుకున్నారట.  ఆ విధంగా తాను మరణించేవరకు అందగాడిగానే కనిపించారు శోభన్ బాబు.

అప్పట్లో శోభన్ బాబు సినిమాలు వచ్చాయి అంటే మగవాళ్ళకంటే ఎక్కువ, అమ్మాయిలే థియేటర్లోకి వెళ్లి చూసేవారట. ఆ విధంగా లేడీ ఫ్యాన్స్ ని పెంచుకొని  అప్పటి అందగాడిగా మారాడు శోభన్ బాబు. శోభన్ బాబు తర్వాత వచ్చిన హీరోలలో నాగార్జున ఆస్థానాన్ని కైవసం చేసుకున్నారు. నాగార్జున ఇప్పటికి ఆరుపదుల  వయస్సు దగ్గరికి వస్తున్న 20 ఏళ్ల పిల్లాడిలా కనిపిస్తూ ఉంటాడు.

ఈయనకు కూడా లేడీ ఫ్యాన్స్ ఎక్కువే. నాగార్జునను మన్మధుడు, అందగాడు ఇలా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. అని ఈ మధ్యకాలంలో నాగార్జున అందం కాస్త తగ్గిపోయింది. అలాంటి ఈ తరుణంలో ప్రస్తుత కాలంలో టాలీవుడ్  అందగాడు ఎవరనే క్యూస్షన్ చాలా మంది మదిలో మెదడుతోంది. ఇదే తరుణంలో  ప్రస్తుతం టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు అని అంటున్నారు. ఆయనకు వయసుతోపాటు అందం కూడా పెరుగుతుందట. ఈయనకు ఈ కాలంలో లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా  ఉంటారు. ఇప్పటికీ 50 ఏళ్ల వయసు దగ్గరికి వస్తున్న  కానీ 25 ఏళ్ల పిల్లాడిలా కనిపిస్తూ ఉంటాడు.

ఆయనకు ఎంత వయసు పెరిగిన అందం మాత్రం మరింత పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ప్రధాన కారణం ఆయన తీసుకునే ఫుడ్ అని చెప్పవచ్చు. అందాన్ని కాపాడుకోవడం కోసం ఆయన ఇష్టమైన ఫుడ్సులు కూడా పక్కన పెడతారట. దీంతో ఆయనకు రోజురోజు అందం రెట్టింపు అవుతోంది. ఆ విధంగా ప్రస్తుత కాలంలో టాలీవుడ్ అందగాడిగా ప్రిన్స్ మహేష్ బాబు మొదటి స్థానంలో ఉన్నాడని చెప్పవచ్చు. మహేష్ బాబు కేవలం సినిమాల్లోనే కాకుండా పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తూ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line nagarjuna tollywood mahesh-babu shobanbabu

Related Articles