movies : వీళ్లు సినిమాలు తీస్తే సూపర్ హిట్టే..కాని ఫాస్ట్ గా తియ్యరు ఎందుకో మరి !

టాలీవుడ్ రేంజ్ మారింది. ఇప్పుడు బాలీవుడ్ ను కాదు టాలీవుడ్ హీరోలను ఆరాలు తీస్తున్నారు. డైరక్టర్ల కోసం క్యూ కడుతున్నారు. ఒక మంచి సినిమా తియ్యడం అంత సులువైన పని కాదు. ఏ విషయానికైనా లక్ ని నమ్మను అని చెప్పవచ్చు కాని  సినిమాల్లో మాత్రం సగం పైన కష్టం...మిగిలింది లక్ అనే చెప్పాలి. కొంతమందికి కష్టం..లక్ అన్ని ఉన్నా..పాపం చాలా లేటుగా సినిమాలను రిలీజ్ చేస్తుంటారు...రిలీజ్ చేస్తే మాత్రం సూపర్ హిట్టే.


Published Jul 15, 2024 02:18:00 PM
postImages/2024-07-15/1721033334_5372NTR.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ రేంజ్ మారింది. ఇప్పుడు బాలీవుడ్ ను కాదు టాలీవుడ్ హీరోలను ఆరాలు తీస్తున్నారు. డైరక్టర్ల కోసం క్యూ కడుతున్నారు. ఒక మంచి సినిమా తియ్యడం అంత సులువైన పని కాదు. ఏ విషయానికైనా లక్ ని నమ్మను అని చెప్పవచ్చు కాని  సినిమాల్లో మాత్రం సగం పైన కష్టం...మిగిలింది లక్ అనే చెప్పాలి. కొంతమందికి కష్టం..లక్ అన్ని ఉన్నా..పాపం చాలా లేటుగా సినిమాలను రిలీజ్ చేస్తుంటారు...రిలీజ్ చేస్తే మాత్రం సూపర్ హిట్టే.


 * రాజమౌళి గురించే చెబుతారు ఆయన సినిమాని చెక్కి చెక్కి జక్కన్నల మారిపోయారు అందుకే ఆయన సినిమా రావాలంటే నాలుగేళ్లు కచ్చితంగా పడుతుంది. ఎన్నో యేళ్ల కు సినిమా తీస్తారు. తీస్తే హిట్టు సినిమానే తీస్తారు. కాని లేటు ...మహా లేటు.


* ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలను తీసిన " విరించి వర్మ "  కూడా చాలా గ్యాప్ తీసుకుంటున్నారు ఇప్పుడైతే ఏకంగా ఏడేళ్ళకు పైగానే అయింది. మరో స్క్రిప్ట్ ఏం చేస్తున్నాడో కూడా హింట్ ఇవ్వలేదు. కాని మంచి దర్శకుడు.
*ఇక హీరోల విషయానికొస్తే అడవి శేషు తన కథను తానే రాసుకుంటారు అందుకే ప్రతి సినిమాకి గ్యాప్ తీసుకుంటున్నారు. కథ, హీరో మ్యానేజ్ చేయడం కష్టం కదా..సో లేటుగా లేటెస్ట్ గా వస్తుంటాడు.


* నవీన్ పోలిశెట్టి కూడా ఇదే తరహా సినిమాలో తీస్తున్నాడు.చాలా ఆలోచించి అన్ని రకాల ఆచితూచి సినిమా తీస్తాడు అది ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హీట్ అవుతుంది. చాలా వరకు నవీన్ ను చూసి సినిమా కు వెళ్లే రేంజ్ వచ్చింది.
* ఇక శేఖర్ కమ్ముల విషయానికొచ్చే సరికి ఆయన సినిమాలు కూడా ఎంతో అద్భుతంగా కళ్ళకు పండగల ఉంటాయి. క్లాసీ హిట్స్...జనాలకు చాలా రోజులు గుర్తుండే సినిమాలు తీస్తుంటారు. కాని త్వరంగా తియ్యడు. ఒక్కో సినిమాకు నాలుగేళ్ల టైం తీసుకుంటారంటే చూడండి.


* సుకుమార్, త్రివిక్రమ్..వీళ్లు కూడా ఫాస్ట్ గా తియ్యరు ..తీస్తే సినిమాకు వంకలు పెట్టలేం. ఏం చేస్తాం...ఏం చెయ్యలేం ...మంచి సినిమా కావాలంటే వెయిట్ చెయ్యాల్సిందే.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movies super-movie

Related Articles