నిఖిల్, పృథ్వీల విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు చాలామందికి నచ్చలేదు. పైగా ఆమె ఆట తీరు కూడా మారిపోయింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ 8 సోనియా ఆకుల ఈ సీజన్ లో చాలా పాపులర్ అయ్యింది. ప్రతి సీజన్ లో ఇలాంటి వైరల్ హౌస్ మేట్ ఖచ్చితంగా ఉంటారు. లాజిక్స్ లాగుతూ ...బాగా వాయిస్ రేంజ్ చేస్తూ ఫుల్ వైరల్ అయ్యింది. ఈ సీజన్ లో మాత్రం ఈమె తన ఆటతో బాగా వైరల్ అయ్యింది. అయితే నిఖిల్, పృథ్వీల విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు చాలామందికి నచ్చలేదు. పైగా ఆమె ఆట తీరు కూడా మారిపోయింది. దాంతో చివరి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉంటుందనుకున్న సోనియా కేవలం నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. రీసెంట్ గా నిఖిల్ ను , ప్రేరణ ను నామినేట్ చేసేసింది. అయితే సోనియా ఆకుల నిన్న ఎంగేజ్ మెంట్ చేసుకుంది.
సోనియా- యష్ ల నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోనియా ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. చాలా సింపుల్ గా సోనియా ఎంగేజ్ మెంట్ జరుగింది. యష్ తో తనకు మూడు సంవత్సరాల పరిచయం ఉందని, బిగ్ బాస్ కి వెళ్లేముందే వివాహం చేసుకోవాలనుకున్నామని చెప్పింది.
యష్ కు గతంలోనే పెళ్లి అయ్యిందట. తన భార్యతో విడాకులు తీసుకున్న తరువాత సోనియాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటుంది.